భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆహ్వానం పై క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన మోడీకి భరత దేశం కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో నిరసన గళం వినిపించింది.
సెప్టెంబర్ 24 న వాషింగ్టన్ లో వైట్ హౌస్ ఆవరణలోని లాఫాయెట్ పార్కులో కొందరు భారతీయులు సమావేశమై తమ నిరసన తెలియజేసారు. మోడీ రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న పలు నిర్ణయాలు భారత రైతాంగం మొత్తాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, జై జవాన్ జై కిసాన్, వుయ్ సపోర్ట్ ఫార్మర్స్ అంటూ ప్లకార్డ్స్ పట్టుకొని నినదించారు. కాకపోతే మోడీ బయటకు రాలేదు.
ఈ నిరసన కార్యక్రమానికి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి అనుమతి కూడా రావడం విశేషం. దీనికి అమరావతి ఉద్యమాన్ని అమెరికాలో బలంగా వినిపిస్తున్న లోకేష్ ఉయ్యూరు లీడ్ రోల్ తీకున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా ఆందోళణ విజయవంతమైందని, మోడీ దుర్మార్గాలను అమెరికా ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో నినదించామన్నారు.