Connect with us

Accidents

Atlanta కి చెందిన 6 గురు తెలుగువారు మృతి, ఒకరు ఎయిర్ లిఫ్ట్ @ Texas, Johnson County

Published

on

టెక్సస్‌ (Texas) రాష్ట్రం లోని జాన్సన్ కౌంటీ (Johnson County), నెమో ప్రాంతంలో పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 26, మంగళవారం సాయంత్రం హైవే 67 పై కౌంటీ రోడ్ 1234 మరియు కౌంటీ రోడ్ 1119 మధ్యలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో 6 గురు మరణించినట్లు మరియు 3 గురు గాయపడినట్లు టెక్సస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ (Texas Department of Public Safety) అధికారులు తెలియజేశారు. ఒక షెవి పికప్ ట్రక్ మరియు హోండా ఒడిస్సీ వాన్ హెడ్ ఆన్ గుద్దుకోవడంతో ఈ దారుణం జరిగింది.

ప్రాధమిక సమాచారం ప్రకారం మినీవాన్ లో అట్లాంటా (Atlanta, Georgia) కి చెందిన లోకేష్ కుటుంబ సభ్యులు 7 గురు ఉండగా 6 గురు అక్కడికక్కడే మరణించినట్లు తెలిసింది. వీరిలో లోకేష్ Tata Consultancy Services (TCS) ద్వారా United Parcel Service (UPS) లో జాబ్ చేస్తున్నట్టు ప్రాధమిక సమాచారం. ఈ ప్రమాదంలో పిల్లలు కూడా ఉన్నట్లు తెలియవచ్చింది.

మిగతా ఒకరిని (Lokesh) మరియు పికప్ ట్రక్ లో ఉన్న ఇద్దరిని గాయాలతో ఎయిర్ లిఫ్ట్ చేసి ఫోర్ట్ వర్త్ ఆసుపత్రి (Texas Health Harris Methodist Hospital Fort Worth) కి తరలించినట్లు స్పోక్స్మన్ విలియం లొక్రిడ్జ్ తెలిపారు. ఈ హాలిడేస్ సీజన్లో అట్లాంటా నుండి డ్రైవ్ చేసుకుంటూ డల్లాస్ వెళ్లి, అక్కడి నుండి Fossil Rim Wildlife Center కి వెళ్లి తిరిగి వస్తుంటే ఈ దురదృష్ట సంఘటన జరిగినట్లు తెలిసింది.

దీంతో హైవే 67 పై కౌంటీ రోడ్ 1234 మరియు కౌంటీ రోడ్ 1120 మధ్య రోడ్లు టెక్సస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ (Texas Department of Public Safety) వారు మూసివేశారు. బాధాకరమైన ఈ ఇన్సిడెంట్ గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected