Connect with us

Movies

ఫ్యాషన్ ప్రపంచాన్ని తెలుగు తెరపై ఆవిష్కరించే “పాషన్” సినిమా ప్రారంభోత్సవం

Published

on

టాలీవుడ్ (Tollywood) లో మరో నూతన సినిమా ప్రారంభమైంది. సుధీష్ వెంకట్, అంకిత సాహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తెలుగు సినిమా “పాషన్”. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమా (Movie) ను తోలు బొమ్మలాట ఫిల్మ్జ్ బ్యానర్ పై డాక్టర్ అరుణ్ మొండితోక, నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.

“పాషన్” (Passion) చిత్రం తో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా (Aravind Jashua) దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆయన స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) వంటి వారి వద్ద పనిచేశారు. మంగళవారం హైదరాబాద్ (Hyderabad) లో “పాషన్” సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది.

ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మొండితోక కెమెరా స్విచ్ఛాన్ చేయగా… దర్శకుడు వేణు ఊడుగుల ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత పద్మనాభ రెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడు అరవింద్ జోషువా (Aravind Jashua) కు అందజేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… ఈ స్టోరీ రాయడం, దాన్ని నవలగా ప్రచురించడం, సినిమా తీసే ప్రయత్నం.. నాకు అన్నీ తెలియజేస్తూ ఉన్నాడు అరవింద్. ఇది చాలా మంచి కథ. నేను అంతా కొత్తవాళ్ళతో తీసిన హ్యాపీడేస్ లా పాషన్ కూడా యూత్ ని ఆకట్టుకుని, ఇన్ స్పైర్ చేసే మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను అని అన్నారు.

నిర్మాత అరుణ్ మొండితోక మాట్లాడుతూ… ఎక్కడా కాంప్రమైస్ కాకుండా కేవలం కథని, దాన్ని హానెస్ట్ గా సినిమాగా తీయడాన్నే నమ్మిన డైరెక్టర్ అరవింద్. అదే సినిమాకి బలమని నమ్ముతున్నాం. త్వరలోనే మా సినిమాను రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్తాం అని అన్నారు.

దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ… పాషన్ నవల చదివాను. నాకు బాగా నచ్చింది మంచి వాక్యం, భావం ఉన్న రచయిత అరవింద్ జోషువా (Aravind Jashua). డైరెక్టర్ గా కూడా అదే ప్రభావవంతమైన సినిమా తీస్తాడని ఆశిస్తున్నా అని అన్నారు.

నిర్మాత ఏ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ… ఈ సినిమా (Movie) స్క్రిప్ట్ నాకు నెరేట్ చేసినపుడు బాగా ఎంగేజింగ్ గా అనిపించింది. అందుకే ఈ సినిమా (Cinema) లో నేను కూడా భాగస్వామిని అవుతున్నాను అని అన్నారు.

దర్శకుడు అరవింద్ జోషువా మాట్లాడుతూ… సినిమా ఫలితం ఎలా ఉంటుందనే ఆలోచన లేకుండా కేవలం కథను నమ్మి మా ప్రొడ్యూసర్స్ అరుణ్, పద్మనాభ రెడ్డి గార్లు సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. వారికి నా థ్యాంక్స్ చెబుతున్నా. మేము అనుకున్న సబ్జెక్ట్ ను నిజాయితీగా తెరకెక్కించాలని ప్రయత్నం చేస్తున్నాం. మా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి బ్లెస్ చేసిన మా గురువు శేఖర్ కమ్ముల గారికి కృతజ్ఞతలు చెబుతున్నా అని అన్నారు.

నటీనటులు – సుధీష్ వెంకట్, అంకిత సాహ, తదితరులు

Technical Team

ఆర్ట్ డైరెక్టర్ – గాంధీ నడికుడికర్
సినిమాటోగ్రఫీ – సురేష్ నటరాజన్
ఎడిటర్ – నాగేశ్వరర్ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – తోలు బొమ్మలాట ఫిల్మ్జ్
నిర్మాతలు – డాక్టర్ అరుణ్ మొండితోక, నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి
రచన, దర్శకత్వం – అరవింద్ జోషువా

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected