తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Telangana CM) శ్రీ అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ & పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం ఆగష్టు 4 నాడు ఇండియన్ కమ్యూనిటీ మరియు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (Indian Overseas Congress) ఆధ్వర్యంలో న్యూ జెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని రాయల్ అల్బెర్ట్స్ పాలస్ (Royal Albert’s Palace) లో భారీ ఎత్తున సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశ సన్నాహాలలో భాగంగా నిర్వాహక బృందం జూలై 28 ఆదివారం నాడు రాయల్ అల్బెర్ట్స్ పాలస్ ని ని సందర్శించారు.
దాదాపు మూడు వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరు కానున్న ఈ సమావేశానికి చెయ్యాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి (Telangana State) పెట్టుబడులు సమీకరించే నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుంచి 10 వరకు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐటీ (Information Technology) మరియుపరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Duddilla Sridhar Babu), ఉన్నతాధికారులు సీఎం వెంట రానున్నారు.
ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) బృందం బహుళజాతి కంపెనీల సీఈవోలతో సమావేశమై తెలంగాణ (Telangana) లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఇదివరకే అధికారులు కొన్ని ఎంఎన్‌సి (Multi National Companies) లతో సంప్రదింపులు జరిపారని, ఎంఒయు (Memorandum of Understanding) లపై సంతకాలు చేయడం ఈ పర్యటన సందర్భంగా సిఎం ప్రకటించే అవకాశం ఉంది.