Connect with us

News

యూకేలో పలు నగరాల్లో నటసార్వభౌమునికి ఘన నివాళి – NRI TDP UK

Published

on

మహా నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం ఎన్ఆర్ఐ టీడీపీ యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.

యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom) లోని పలు నగరాల్లో జ్యోతి వెలిగించి, పూలతో తమ ప్రియతమ నేతకు నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం అంటూ నినదించారు ఆయన ఆశయాలను సాధించడానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) సినిమా జీవితం, రాజకీయ అరంగేట్రం, తెలుగుదేశం పార్టీ స్థాపన వంటి పలు విషయాలను గుర్తుచేసుకున్నారు.

అన్న నందమూరి తారక రామారావు ఫోటోలు, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జండాలు, బ్యానర్లతో వేదికను అలంకరించడంతో అందరూ ఆహ్లాదకరంగా ఫోటోలు దిగారు.

Feltham, Hounslow, Sutton, Coventry, Woking, Chelmsford, Eastham, Hatfield, Slough నగరాల్లో ఆయా నగరాల NRI తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో అన్న గారికి నివాళులు అర్పించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected