Connect with us

News

మేరీలాండ్లో ఎన్టీఆర్ వర్థంతి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి నన్నూరి వీడియో కాల్ సందేశం

Published

on

అమెరికాలోని మేరీలాండ్లో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమం జనవరి 18న ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం శ్రీనాథ్ రావుల ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా జయరాం కోమటి వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ.. సమాజంలో ప్రజల రూపంలో దేవుడిని చూసిన వ్యక్తి ఎన్టీఆర్. రాజకీయాలలో పెత్తందారులకు కాకుండా చదువుకున్నవారికి, బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. దశదిశలా తెలుగువారి ఖ్యాతిని పెంచారు. ప్రజల హృదయాల్లో నందమూరి తారక రామారావు చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ.. తెలుగువారి వాడి వేడి ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్. పేదలకు కూడు, గూడు కల్పించారు. బీసీలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు. వెండితెరపై దేవుడు, రాజకీయ వేదికపై నాయకుడు, ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్. అక్రమ కేసులు, కక్షసాధింపులకే నేటి పాలకులు అధికారాన్ని వినియోగిస్తున్నారన్నారు తప్ప అభివృద్ధి పట్టడం లేదు. టీడీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు నడుంబిగించాలన్నారు.

నరిశెట్టి ఇన్నయ్య మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేని ముఖ్యమంత్రి ఎన్టీఆర్. ఆయన సామాజిక సేవా దృక్పథంతో సంక్షేమా రాజ్యాన్ని తీసుకువచ్చిన సంఘసంస్కర్త అని అన్నారు. ప్రపంచంలో ఆంధ్రులను తిరుగులేని శక్తిగా మార్చడంలో ఎన్టీఆర్ నాటిన బీజాన్ని చంద్రబాబు గారు మహావృక్షంగా మార్చారన్నారు.

జీడబ్ల్యూజీసీఎస్ మాజీ అధ్యక్షులు సుబ్బారాయుడు జక్కంపూడి, రాజా రావులపల్లి మాట్లాడుతూ.. అమెరికాలో ఎన్టీఆర్ పర్యటన సందర్భంగా ఆయనతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నామన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

రాజశేఖర్ చెరుకూరి, నాగప్రసాద్ గనపనేని, శ్రీనివాస్ సామినేని, వెంకట్ కూకట్ల తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శివ నాగ మహేష్ నెలకుదిటి, రమేష్ నూతక్కి, జానకి రామ్ బోగినేని, కిషోర్ కంచర్ల, గోపీకృష్ణ అమిరినేని, గుండూరి యశ్వంత్, శివ నెల్లూరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected