డెన్మార్క్ లో ఘనంగా జరిగిన అన్న నందమూరి తారక రామారావు గారు శతజయంతి వేడుకులు, మహానాడు వేడుకలు. తెలుగు ప్రజలందరూ అక్కడ ఒక్కటిగ వచ్చి ఆ మహనీయుడు గురించి నెమరువేసుకున్నారు. తెలుగు వాడి ఆత్మగౌరవం మన అన్న గారు అని కొనియాడారు.
మహిళామ తల్లులు కూడా భారీసంఖ్యలో పాల్గొన్నారు, అలానే అన్నగారు ఆడవారికి సమన హక్కు కలిగించటం మరియు వివిధ సామజిక అసమానతలు తొలగించటం, పేదవారికి కూడు గుడ్డ నీడ లాంటి మంచి పథకాలు తీసుకుని రావటం, వెరసి అయన కారణజన్ముడు అయ్యాడు అని కొనియాడారు.
తెలుగు యువత, తెలుగు మహిళా, మరియు వివిధ విభాగాలకు సంబందించిన అందరు ఈ కార్యక్రమానికి అటెండ్ అయి, చాల చక్కగా జరుపుకున్నారు. ముందుగా కార్ ర్యాలీ తో ఆరంభించారు కార్యక్రమాన్ని ఆ తరువాత వివిధ ప్రసంగాలు అలానే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
అన్నగారి సంక్షేమం, రెండు రూపాయలకీ కిలో బియ్యం పథకం, ఒకటేమిటి అయన ఏది చేసిన శ్రీరామా రక్షా ప్రజలకి అని కొనియాడారు. తెలుగు దేశం ఎప్పుడు అధికారం లో వున్నా ప్రజలకి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాగా చూసుకునేవారు అని చెప్పారు. ప్రజలకి మొదటి సరిగా పింఛన్ పథకం అన్న గారు తెచ్చారు అని అది ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కీ ఒక దిస్కుచి అయింది అని అన్నారు.
మహానాడు లో భాగం గ డెన్మార్క్ తెలుగు యువత సభ్యులు తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటిని TDP డెన్మార్క్ కార్యవర్గ సభ్యులు ఆమోదించారు. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి అని అలానే ఆంధ్రులు భవిషత్తు , యువత భవిషత్తు బాగుండాలి అని, మున్ముందు విదేశీ విద్య పథకం ప్రవేశ పెట్టి విద్యార్థులని ఆదుకోవాలి అని పిలుపు ఇచ్చారు.
నారా లోకేష్ యువనాయకత్వం లో మన రాష్ట్రానికి ఉజ్వల భవిషత్తు రాబోతుంది అని, యువగలం స్పందన చూస్తుంటే అది అర్ధం అవుతుంది అని అన్నారు. చంద్రబాబు గారు ఈ రోజు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అద్భుతం గ వుంది అని, అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది అని పలువురు NRI లు కొనియాడారు.
సైకో పాలన పోయి సైకిల్ పాలనా వచ్చి రాష్ట్రము అభిరుద్ది లో అలానే యువత కీ అవకాశాలు వచ్చి రాష్ట్రము సుభిక్షం గ ఉండాలి అని ముక్త కంఠం తో నినదించారు.