Connect with us

Events

NRI TDP UK ఆధ్వర్యంలో ఘనంగా NTR & Kodela జయంతి వేడుకలు – Dr. Sivaram Kodela

Published

on

ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ శత జయంతి మరియు వారి మానస పుత్రుడు పలనాటి పులి డాక్టర్ కోడెల గారి 75వ జయంతి ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ – ఎన్నారై యుకె టీడీపీ ఆధ్వర్యంలో ఇరువురి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు దేశం కుటుంబసభ్యులు బాణసంచా కాల్చుతు లండన్ లో అంబరాన్ని తాకే సంబరాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. Dr కోడెల శివ ప్రసాద్ గారి తనయుడు Dr కోడెల శివరాం గారిని సభావేదికపై జయకుమార్ (రీజినల్ కౌన్సిలర్ మెంబెర్), శ్రీనివాస్ పాలగుడు (జనరల్ సెక్రటరీ) సురేష్ కోరం, సుందరు , ప్రసన్న నాదెండ్ల, నరేష్, శ్రీనివాస్ ఆహ్వానించారు. రానా ప్రతాప్ వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని ఆద్యంతం ఆకట్టుకున్నారు.

కోడెల శివరాం గారు ముందుగా అందరికి ఈ రోజు అన్న నందమూరి తారకరామారావు గారు శతజయంతి మరియు కోడెల శివప్రసాద్ గారి జయంతి అలానే ఆడవారికి అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని పాటుపడిన నాయకుల జయంతి ఉత్సవాలల్లో భాగంగా ఈ రోజు మదర్స్ డే కూడా కావడం చూస్తుంటే ఒక త్రివేణి సంగమం లాగా వుంది అని అభివర్నించారు. NTR అంటే ఒక ఎమోషన్, NTR అంటే ఒక మార్గదర్శుకుడు, NTR అంటే ఒక ప్రజానాయకుడు ,ఎన్టీఆర్ అంటే ఒక దేవుడు, అలాంటి దేవుడికి మానసపుత్రుడు గా కోడెల ఉండటం అనేది మా పూర్వజన్మ సుకృతం అని తెలియచెయ్యటానికి గర్వపడుతున్నాను అంటూ జూనియర్ కోడెల వ్యాఖ్యానించారు. ఈ శతజయంతి ఉత్సవాల సందర్భం గా వారి ప్రతిమతో నాణెము ప్రజలకు అందుబాటులోకి రావడం ముదావహం,అలానే భారతరత్న బిరుదు తో వారికి నిజమైన గౌరవం పాలకులు ఇవ్వాలని శివరామ్ ఆకాక్షించారు.

CBN గురించి మాట్లాడుతూ.. మా నాన్న గారికి ఆయనకి చాల దగ్గర సంబంధం వుంది. ఏదియైన ఒక పని బాబు గారు అప్పగించారు అంటే అది అయ్యేవరకు కోడెల గారు నిద్రపోరు. బాబు గారు నాన్న గారికి పంచాయితీరాజ్, వైద్య విద్య ఆరోగ్య శాఖ, ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ లాంటివి అప్పచెబితే ఏంటో నిబద్దత గా పని చేసారు..ఆ భాగం లో డ్వాక్రా గ్రూపులు కానివ్వండి, నదుల అనుసంధానం కానివ్వండి..ఇలా ఏది చెప్పిన నిబద్దత తో చేసే నాయకుడు కోడెల శివప్రసాద్ గారు అని కొనియాడారు. ఈ రోజు మనము అందరమూ విదేశాలలో కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నాము అంటే దానిలో బాబు గారి కృషి ఎంతో వుంది. ABC అంటే ఎవ్వరి అడిగిన A అంటే ఆంధ్ర అని, B అంటే బాబు గారి వలన, C అంటే కంప్యూటర్ రంగం లో, D అంటే డామినేట్ చేసే స్థాయికి మన తెలుగు జాతి ఈనాడు, ఈ స్థాయి కి చేరామంటే అది చంద్రబాబు గారి దార్శనికత నిదర్సనం అంటూ కొనియాడారు.

సోదరుడు లోకేష్ మన రాష్ట్రము కోసం కస్టపడుతూ పాదయాత్ర చేస్తున్నారు, ఈ రోజే 100 రోజులో అవ్వటం లో భాగం గా ఈ కార్యక్రమము కలిసి రావటం కూడా చాల అబినందదాయకం. సత్తెనపల్లి లో నేను పిలుపు ఇచ్చాను ఈ రోజు మార్నింగ్ నుంచి అదే ఏర్పాట్లులో వున్నాము. వివిధ కార్యక్రమాలతో నేను ఇక్కడ ఉన్నప్పటికీ మా కార్యకర్తలు ఇచ్చిన పిలుపు మేరకు గ్రాండ్ సక్సెస్ చేసారు. నేను కూడా ఇక్కడ వుంది లోకేష్ గారి 100 రోజులో యాత్ర లో భాగం గా ఇలా కలిసి రావటం చాల సంతోషం అని వెలిబుచ్చారు.

తెలుగు దేశం లో ఎన్నో కుటుంబాలు నలభై ఏళ్ళ నుంచి వెన్నుముకగా వున్నారు. అందులో ఒక కోడెల కుటుంబం, పరిటాల కుటుంబం, అయ్యన కుటుంబం, అశోక్ గజపతి రాజు కుటుంబం, యనముల కుటుంబం ఇంకా చాల కుటుంబాలు తెలుగు దేశం ని అంటిపెట్టుకుని వున్నాము. మా అధినాయకుడు మీద ఈగ కూడా వాలనిన్నవకుండా 40 ఏళ్ళ పాటు. అందులో భాగం గానే వీటిని నిర్వీర్యం చెయ్యటం కోసం కుటుంబాల మీద తప్పుడు ప్రచారాలు, ఆస్తులు లాక్కోవటం లేదా బెదిరించి పార్టీ మారేలాగా వత్తిడి చెయ్యటం లేదా రాజకీయాలకి దూరం గా ఉండమని కాంప్రమైజ్ ప్రపోసల్ తీసుకుని రావటం. దురదృష్టవ శాత్తు మొదటిగా మా కుటుంబం మీద చేసారు ఇప్పుడు దాన్ని కొనగిస్తూ కింజరాపు, అయ్యన్న, గజపతి రాజు గారు అంత ఎందుకు ఈ రోజున రామోజీ రావు గారి మీద కూడా విషప్రచారం చేస్తున్నారు.

నేను కోడెల బిడ్డగా మీ అందరికి మాట ఇస్తున్నాను, నేను ఎక్కడ రాజి పడను, నా తండ్రి అడుగుజాడలలో నడుస్తాను..డీ అంటే డీ కొడతాను…మా నాన్న గారి ఆశయాలను, తండ్రి స్థానం లో వున్నాబాబు గారి ఆలోచనలను సోదరుడు లోకేష్ అడుగుజాడలలో పార్టీ
విలువలని కాపాడుకుంటూ మా కార్యకర్తలని కాపాడుకుంటూ సత్తెనపల్లి లో తెలుగు దేశం జండా ఎగరటం ఖాయం, అలానే నేను ఒకటికి ఒకటిన్నర తిరిగి ఇవ్వటం ఖాయం అంటూ, రాబోయే కాలం మనకి ఎన్నికల కాలం, మీ అందరూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గా గానీ 2024 లో తెలుగదేశం పార్టీ విజయానికి కృషి చేసి, నారా చంద్ర బాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గా చెయ్యవలసిన అవశ్యకత ఎంతైనా ఉందంటూ తెలియజేసి, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించి నందుకు తెలుగు దేశం పార్టీ తరుపున పేరు,పేరున ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected