Connect with us

Birthday Celebrations

ఘనంగా నివాళులు అర్పించిన Charlotte వాసులు @ NTR 101వ జయంతి వేడుకలు

Published

on

మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అభిమానుల ఆరాధ్య రాముడు శ్రీ నందమూరి తారక రామారావు101వ జయంతి వేడుకలను చార్లెట్‌ (Charlotte) లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ (NTR) అభిమానులు, తెలుగుదేశం పార్టీ (TDP) సానుభూతిపరులు పలువురు హాజరై ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంకోసం చార్లెట్‌ (Charlotte, North Carolina) నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళి వారివారి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తరపున ప్రచారం చేసి వచ్చారు. వారంతా తమ అనుభవాలను వచ్చినవారితో పంచుకున్నారు.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం (Andhra Pradesh) పార్టీ విజయం సాధిస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఎన్టీఆర్‌ (NTR) స్థాపించిన తెలుగుదేశం పార్టీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి సాధించగలదని వారు తెలియజేశారు.

ఈ NTR 101వ జయంతి వేడుకలు (Birthday Celebrations) కార్యక్రమానికి హాజరైనవారంతా ఎన్టీఆర్‌ (Nandamuri Taraka Ramarao – NTR) నట విశ్వరూపాన్ని స్మరించుకుంటూ ఆయన నటించిన ఎన్నో సినిమాలు అందరి గుండెల్లో నేటికీ చెరగని ముద్రవేసుకుని ఉన్నాయని చెప్పారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected