Connect with us

News

NTR 28వ వర్ధంతి సందర్భంగా ర్యాలీ లో సంస్మరణ కార్యక్రమం: North Carolina

Published

on

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి అభిమాన నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao – NTR) 28వ వర్ధంతి సందర్భంగా జనవరి 18, గురువారం సాయంత్రం నార్త్ కరోలినా రాష్ట్రం (North Carolina), ర్యాలీ (Raleigh) నగరంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సంస్మరణ కార్యక్రమాన్ని వంశి బొట్టు, మిథున్ సుంకర, శశిధర్ చదలవాడ, కేశవ్ వేముల, వినోద్ కాట్రగుంట, వెంకట్ కోగంటి, సిద్ద కోనంకి నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ (NTR) చిత్ర పటానికి దండ వేసి, జ్యోతి వెలిగించి, పూలతో ఘనంగా నివాళులు అర్పించారు.

సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ మహానాయకుడిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. రాజకీయంగా, సామాజికంగా ఎన్నో ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకున్న ఎన్టీఆర్ (NTR) ని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కొనియాడారు.

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జెండాలు, కండువాలు, బ్యానర్, పసుపు పూలతో వేదిక ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు. రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నాయకత్వంలో టీడీపీ-జనసేన (TDP & Janasena) ప్రభుత్వం రావలసిన ఆవశ్యకతను మననం చేసుకున్నారు.

అమెరికాలో వర్కింగ్ డే అయినప్పటికీ అన్నగారిపై అభిమానంతో పెద్దఎత్తున తెలుగు ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ బజార్ (Bharat Bazar) మరియు ఫ్యూషన్ 9 రెస్టారెంట్ (Fusion 9 Restaurant) వారు ఈ కార్యక్రమానికి ఫుడ్ స్పాన్సర్ చేశారు. జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda), రామ్ అల్లు (Ram Allu), మూర్తి అక్కిన, కుమార్ చల్లగొల్ల, ప్రవీణ్ తాతినేని, ప్రసాద్ వేములపల్లి, మాదవి ముప్పవరపు, సురేష్ వెల్లంకి, సునీల్ కొల్లూరు, మధు సుంకు, నాగేంద్ర కొడాలి, కళ్యాణ్ మద్దిపాటి, రవి దర్శి, వెంకట్ దగ్గుబాటి, రమేష్ తుమ్మలపల్లి, శ్రీపాద, బాల గర్జల, గిరి నర్రా, నరసింహ, కార్తీక్, కేదార్, ప్రకాష్, సుధాకర్ కాకరపర్తి, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected