Connect with us

Government

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా San Diego లో NRIల మానవహారం

Published

on

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఎన్‌ఆర్‌ఐ San Diego ఆధ్వర్యంలో పార్టీలకు మరియు ప్రాంతాలకు అతీతంగా ప్రవాసీయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

చంద్రబాబును తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని నినదిస్తూ నారా చంద్రబాబు నాయుడు అభిమానులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు.

We are with CBN, NRI’s with CBN, IT people with CBN, We want Justice, “జై బాబు, జై జై బాబు” నినాదాలతో మానవహారం కార్యక్రమం ముందుకు సాగింది. ఈ కార్యక్రమం లో మహిళలు మరియు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ సర్కార్ కక్షపూరిత విధానాలపై మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వచ్చేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసీయులు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected