అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. అమెరికా పర్యటనలో భాగంగా పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా (Philadelphia) నగరంలోని ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గౌరు వెంకట్ రెడ్డి ఎన్నారైలను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్ ప్రాంతాన్ని మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారని, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఓర్వకల్ (Orvakal, Kurnool District) కీలకపాత్ర పోషించనుందని అన్నారు.
కాబట్టి ఎన్నారైలు తమ నైపుణ్యం, పెట్టుబడులతో ముందుకు వచ్చి తమవంతు పాత్ర పోషించాలని కోరారు గౌరు వెంకట్ రెడ్డి (Gowru Venkata Reddy). కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్, తానా బోర్డు సభ్యుడు రవి పొట్లూరి (Ravi Potluri) నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.