November 28, 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారం లో భాగంగా బిజెపి (Bharatiya Janata Party) ఎన్నారై సెల్ అద్వర్యంలో గోశామహల్ (Hyderabad) నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. గోశామహల్ (Goshamahal) నియోజకవర్గ BJP అభ్యర్థి రాజా సింగ్ గారిని కలిసి సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా వెంకట్ నూకల, విలాస్ రెడ్డి జంబుల, నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ హిందూ టైగర్ రాజాసింగ్ పై కెసిఆర్ ఎన్ని కేసులు పెట్టిన భయపడకుండా 500 కోట్లతో గోశామహల్ నియోజకవర్గ అభివృద్ధి చేసారని ధర్మ రక్షణ కోసం రాజా సింగ్ (Thakur Raja Singh) ని గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి ఎన్నారై సెల్ International మరియు మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు, ఆస్ట్రేలియా బిజెపి ఎన్నారై సెల్ లీడర్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి, ఆస్ట్రేలియా బిజెపి ఎన్నారై లీడర్ అదిరెడ్డి, అమెరికా ఎన్నారై OF BJP తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, మహేందర్ రెడ్డి స్థానిక నాయకులు చిల్లంపెళ్లి నరేష్, విద్వాన్ గారితోపాటు ఎన్నారై సెల్ టీం మిత్రులు పాల్గొన్నారు.