Connect with us

Politics

బోస్టన్ లో అన్ని హంగులతో మహానాడుకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్న పసుపుదళం

Published

on

అమెరికాలోని బోస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో మహానాడుకు అన్ని హంగులతో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 20, 21న పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ పసుపు పండుగకు మశాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ మరియు కనెక్టికట్ ఎన్నారై టీడీపీ పసుపుదళం శాయశక్తులా కృషి చేస్తున్నారు.

ఈ తెలుగుదేశం పార్టీ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంవిఎస్ఎన్ రాజు, మాగంటి మురళీమోహన్, గౌతు శిరీష, వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మన్నవ సుబ్బారావు, నన్నూరి నర్సిరెడ్డి, కందుల నారాయణ రెడ్డి వంటి హేమాహేమీలు ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్నారు. కొంతమంది నేతలు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు.

ఈ పసుపు పండుగకు వేదిక అయినటువంటి బెస్ట్ వెస్ట్రన్ రాయల్ ప్లాజా హోటెల్ ట్రేడ్ సెంటర్ ను ఇప్పటికే ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి బోస్టన్ ఎన్నారై టీడీపీ సభ్యులతో కలిసి సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే అడ్వైజరీ కమిటీ మరియు వర్కింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకలు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఈ మహానాడులో హైలైట్ అవనున్నాయి. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు కోటి & ట్రూప్ తో మ్యూజికల్ నైట్, తారక రాముని చిత్రపటాల ప్రదర్శన శాల, సాంస్కృతిక కార్యక్రమాలు, నేతల ప్రసంగాలు, టీడీపీ మేధోమధనం వంటివి అమెరికా పసుపు సైనికుల్లో ఉత్తేజాన్ని నింపనున్నాయి.

అంగరంగ వైభవంగా జరగనున్న ఈ బోస్టన్ మహానాడుకు ప్రవేశం ఉచితం. తెలుగింటి ఆడపడుచులు, అన్న తమ్ముళ్లు, అక్క చెల్లెమ్మలు అందరూ కుటుంబ సమేతంగా ఆహ్వానితులే. అందరూ https://mahanaduboston.eventbrite.com/ లో రిజిస్టర్ చేసుకోవలసిందిగా, అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్నారై సభ్యత్వాన్ని https://nritdp.com/mregister.php లో తీసుకోవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected