Connect with us

Financial Assistance

కృష్ణా జిల్లా అవనిగడ్డకి చెందిన లాస్య కిడ్నీ ఆపరేషన్ కు NRI TDP USA దాతృత్వం

Published

on

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) గారి సూచనల మేరకు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ కుటుంబ సభ్యుడు గాజుల మురళీకృష్ణ గారి కుమార్తె కిడ్నీ మార్పిడి చికిత్సకు NRI TDP USA వారు 15 లక్షల రూపాయలు సహాయం చేశారు.

కష్టాల్లో వున్న తెలుగుదేశం కార్యకర్తలకు తమవంతు సహాయం చెయ్యటం కోసం NRI TDP USA ఎల్లప్పుడూ ముందు వరసలో ఉంటుంది. ఈ పాప తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీ గాజుల మురళి కృష్ణ గారి కుమార్తె లాస్య. ఈ పాప రెండు కిడ్నీలు దెబ్బ తినటంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆపరేషన్ చేసి కిడ్నీ (Kidney) మార్చాలని వైద్యులు చెప్పారు.

మండలి బుద్ధ ప్రసాద్ (Mandali Buddha Prasad) గారి ద్వారా ఆ విషయం తెలుసుకున్న నారా లోకేష్ గారు NRI TDP USA కి తెలియచేయటంతో, కోమటి జయరామ్ (Komati Jayaram) గారి ఆధ్వర్యంలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ సభ్యుల సహాయ సహకారాలతో 15 లక్షల రూపాయలు సేకరించి అక్టోబర్ 28 న తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఆ సహాయం అందజేయటం జరిగింది.

ఉండవల్లి (Undavalli) లోని తన నివాసంలో 15 లక్షల చెక్కుని పాప తండ్రి మురళీకృష్ణకి టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అక్టోబర్ 28 శుక్రవారం రోజున అందజేశారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన NRI TDP USA బృందాన్ని ఈ సందర్భంగా లోకేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టిడిపి ఇంఛార్జ్, సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్ తో పాటు నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected