ఎన్నారై టీడీపీ యూకే మరియు యూరప్ విభాగం నుంచి తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల (చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం పోటుకనుమ గ్రామస్థులు), వివేక్ కరియవుల పూతలపట్టు నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు.
గతంలో కార్యకర్తల మీద దాడులు జరిగితే అండగా ఉండి న్యాయ సహాయం చేశారు. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఇదే బాటలో కొన్ని నియోజకవర్గాలని వీరు ఎంచుకుని ఒక ప్రణాళిక ద్వారా అమలు పరుస్తున్నారు. ఈ మూడు రోజులు పార్టీ వాలంటీర్స్‌కి అలానే కొన్ని మండల ముఖ్య కేంద్రాలలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ తమ పరిధిలో ఏర్పాటు చేశారు.
3, 4, 5 తేదీలలలో పూతలపట్టులో ఏర్పాటు చేశారు. అలానే మరల నగరిలోకి వెళ్లగానే అక్కడ కూడా భారీఎత్తున సేవా కార్యక్రమాలు చెయ్యటానికి తమ వంతు సహాయం చేస్తున్నారు. జన్మ భూమికి మేము సైతం అని వీరు చేస్తున్న కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శప్రాయం.
గతంలో టిట్లి తుఫాన్‌లోను, అలానే యుక్రెయిన్‌లో బాధితులకి సహాయం చెయ్యటంలో కూడా ముందుండి పార్టీ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విదేశాలకి వచ్చిన స్టూడెంట్స్‌కి తమ పరిధి మేరకు సహాయం చెయ్యటం, అలానే మంచి ఉద్యోగాలు ఇప్పించటంలో యూరప్‌లో మొదటి నుంచి బాగా పని చేశారు.
ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకి సోషల్ మీడియా ట్రైనింగ్, అలానే వివిధ ట్రైనింగ్స్ ఇచ్చేలా ఒక్కో నియోజకవర్గానికీ ఒక్కో స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారు. తెలుగుదేశం వస్తేనే యువతకి భవిత… లేకపోతే మరో ౩౦ ఏళ్ళు వెనక్కి పోతారు అని, వారు ఎలా అయినా తమ వంతుగా అక్కడ పార్టీకి ఉపయోగపడే విధంగా ముందుకు వెళుతున్నారు.
యువ నాయకుడు లోకేష్ సుదీర్ఘ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యి, తెలుగుదేశం పార్టీని విజయతీరాలకు చేర్చాలని కోరుకుంటూ ధృడమైన ఆశాభావం వ్యక్తం చేసి, పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ 400 రోజుల్లో తమ పరిధి మేరకు కొన్ని నియోజక వర్గాలలో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
డా. కిషోర్ బాబు చలసాని, కృష్ణ వల్లూరి, శ్రీనివాస్ గోగినేని, కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, అమర్నాథ్ పొట్లూరి, వేంకటపతి, ప్రవీణ్ ఉన్నం, ప్రవీణ్ వెలువోలు, కొండయ్య కావూరి, శివ కృష్ణ & సుమంత్ పద్మాల గారు మరియు వివిధ NRI సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాలకు తమ వంతు సహాయం అందిస్తున్నారు.