Connect with us

Politics

Boston, Massachusetts: NTR & కోడెల కి ఘన నివాళి, P4 కార్యక్రమంలో పాలుపంచుకోవాలని అభ్యర్ధన – Dr. Sivaram Kodela

Published

on

అమెరికా లోని Boston నగరంలో ది 4/10/2025 నాడు జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం గారు, NRI టీడీపీ సభ్యులు మరియు గ్రేటర్ బోస్టన్ తెలుగు అసోసియేషన్ సభ్యులతో కలసి పాల్గొని,
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు (NTR) గారు మరియు నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించడం జరిగినది.

ఈ సందర్భంగా డాక్టర్ శివరాం (Dr. Kodela Sivaram) గారు ప్రసంగిస్తూ.. తెలుగు వల్లభుడు ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీ స్థాపించి మనందరికీ కి ఒక గుర్తింపు తీసుకొని వస్టే మన ఉనికిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారిది ప్రతి రంగంలో తెలుగు వారిలో ఉన్న కష్టపడే తత్వానికి, క్రమశిక్షణనకు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తీసుకొని వచ్చి, మన వాళ్ళు ఎన్నో విజయాలు సాధించడంలో చంద్రబాబు గారి పాత్ర అనంతం, అజరామరం.

యువతకు స్ఫూర్తి నారా లోకేష్ (Nara Lokesh) గారు, మన తర్వాత వచ్చేతరాలు కూడా బాగుండాలనే సంకల్పంతో భావి తరాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ను మన రాష్ట్రంలో ఏర్పాటుకు కృషి చేయడం ఆర్సెలర్, రిలయన్స్, మిట్టల్, BPCL రిఫైనరీ, Google, TCS, Cognizant వంటి మల్టీ నేషనల్ కంపెనీలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేయించడానికి చేస్తున్న కృషి , రాబోవు తరాలకు ఒక స్ఫూర్తి దాయకం అవుతుందని తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో అది ఒక చరిత్రాత్మక ఘట్టం గా నిలుచి పోతుంది.

కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడి కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారు ఎంతో ప్రేమతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన P4 గురుంచి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా చరిత్రలో నిలిచిపోతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.

పుడితే కారణ జన్ముడు ఎన్టీఆర్ (NTR) గారిలాగా పుట్టాలి, పరిపాలన చేస్తే చంద్రబాబు గారిలాగా చేయాలి.

విపత్కర సమయంలో ఎలా నిలబడి – కలబడి గెలవాలో లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి.

నమ్మిన జనం కోసం నిలబడి పోరాటం చేయడంలో పల్నాటి పులి కోడెల (Kodela Siva Prasada Rao) గారిని చూసి నేర్చుకోవాలి.

విదేశాల్లో వివిధ రంగాలలో స్థిరపడిన ప్రతి ఒక్కరు P4 కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి, ప్రతి పేద కుటుంబాని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలన్న చంద్రబాబు గారి కల సాకారం అయ్యేలా కృషి చేయాలి అని డాక్టర్ శివరాం (Dr. Kodela Sivaram) అభ్యర్థన చేశారు.

సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగిస్తూ.. కోడెల గారికి తమకి గల ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చూసుకొంటూ, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ కోడెల గారు. సమస్యలు వచ్చినా, చివరికి ప్రాణాలు పోయినా పర్లేదు అంటూ పణంగా పెట్టి, 35 ఏళ్లు నమ్మిన ఒకే పార్టీ, ఒకే నాయకుడితో కలిసి పని చేసిన వ్యక్తి పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి.

ఆయన గుర్తుకు వస్తే మొదట గుర్తుకు వచ్చేది ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి (Basavatarakam Indo American Cancer Hospital & Research Institute), అ ఆసుపత్రి విషయంలో ఎన్టీఆర్ గారు కోడెల గారిపై ఉంచిన నమ్మకం కోసం, ఆసుపత్రి అభివృద్ధి కోసం కోడెల గారు ఎన్నో వ్యయ ప్రయాసలకి ఓర్చి లక్షల మంది జీవితాలలో వెలుగులు నింపిన విషయం చరిత్రలో నిలిచిపోతుంది.

కోటప్పకొండ గుడిలో దీపం వెలిగినంత కాలం, అ గుడిలో గంట మ్రోగినంత కాలం కోడెల గారి పేరు మారు మోగుతూనే ఉంటుంది.ఎన్ని అవాంతరాలు వచ్చిన పార్టీ కోసం ఆయన నిలబడిన తీరు ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తూ కోడెల గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గొంది, అనిల్ పోట్లూరి, కృష్ణప్రసాద్, సూర్య, రాఘవ, సురేష్,గోపి, చంద్ర, సతీష్, గౌతమ్ చుండ్రు, సునీల్, తారక్, వెంకట్, బోపేష్ NRI TDP సభ్యులు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (Telugu Association of Greater Boston – TAGB) సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected