ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ కువైట్ లోని తెలుగు దేశం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా చేసిన వ్యక్తి, హుందా రాజకీయాలు నడిపిన వ్యక్తి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు.
ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చి యువత కు ఉద్యోగాలకు రూపకల్పన చేసి, పరోక్షంగా ఎంతో మంది ఉపాధి అవకాశాలు కల్పించిన బాబు గారిని అక్రమ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. 2021 లో నమోదు అయిన కేసు లో కోర్టుకు సాక్ష్యాధారాలు చూపలేక పోయిన ఈ వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ అదే కేసులో బాబు గారిని అరెస్ట్ చేయడం కక్ష రాజకీయాలకు నిదర్శనం అని తెలిపారు.
ఈ కార్యక్రమములో గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి గారు, అధ్యక్షులు నాగేంద్ర బాబు గారు, ఈశ్వర్ నాయుడు గారు, సీనియర్ నాయకులు బాలకృష్ణ, సుధాకర్,శ్రీనివాస్, భాస్కర్, రాజశేఖర్, చిన్నరాజు గార్లు, ప్రధాన కార్యదర్శి మల్లి మారోతూ గారు, కమిటీ సభ్యులు మోహన్ రాచూరి, సుబ్బారెడ్డి గార్లు, మైనార్టీ నాయకులు అర్షద్, ముస్తాక్ ఖాన్, చాన్ భాష గార్లు, బీసీ నాయకులు శంకర్ యాదవ్, పెంచలయ్య, మహేష్, నరసింహం గార్లు, మహిళా నాయకురాలు నారాయణమ్మ గారు, గవర్నరెట్ సభ్యులు, క్షత్రియ సంఘం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.