NRITDP Gulf Council సభ్యులు వెంకట్ కోడూరి NRI TDP Kuwait ప్రధాన కార్యదర్శి మల్లి మారోతు, కోశాధికారి రాచూరి మోహన్ ఆధ్వర్యంలో Salmiya ప్రాంతంలో జనసేన నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ మేము సైతం బాబుకి తోడుగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జనసేన (Janasena) నాయకులు పాల్గొన్నారు. రెండు పార్టీ ల అధినాయత్వాలు వచ్చే ఎన్నికల్లో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో Kuwait లో రెండు పార్టీ ల నాయకులు సంయుక్తంగా ఒకే వేదిక ద్వారా భవిష్యత్ లో కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలను స్వార్థ రాజకీయాల కోసం, కక్ష్యా రాజకీయాలు చేస్తూ రాక్షస క్రీడ ఆడుతున్న వైసీపీ అధినేత జగన్ (YS Jagan Mohan Reddy) ఒక ప్రతిపక్ష పార్టీ నాయకున్ని,ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటపుడు పాటించాల్సిన ప్రాథమిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, కనీస నియమాలు పాటించకుండా అరెస్ట్ చేయడం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు అని అర్థం అవుతున్నది.
అసలు ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకుండా, కేబినెట్ హోదా కలిగిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటపుడు గవర్నర్ కి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను కూడా విస్మరించి, ఆధారాలు చూపకుండా అక్రమ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమలు జరిపిన అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ బడ్జెట్ తో ఈ పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో అమలు చేశారు.
371 కోట్ల పన్నులతో కలిపి ఆంధ్రప్రదేశ్ డిజైన్ టెక్ కంపెనీ కి నిధులు విడుదల చేసిన మాట వాస్తవం కాదా? ఆ మొత్తానికి సరిపడా పరికరాలు ఉన్నాయా? లేదా? అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సంబంధించి ఎక్విప్మెంట్ అంతా చేరింది అని అప్పటి అధికారులు నిర్ధారించింది వాస్తవం కాదా? కేంద్ర ఆడిట్ సంస్థ అన్ని సక్రమంగా ఉన్నాయి అని నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా?
మీరు సిమెన్స్ కు లేఖ రాసిన దానికి వారు ఇచ్చిన సమాధానాన్ని in aid grant లేదు, in kind grant మా దగ్గర ఉంది, దాని ప్రకారమే మేము ఆంధ్రప్రదేశ్ కు సాఫ్ట్వేర్ ను ఇచ్చాము అని చెప్పిన మాట వాస్తవం కాదా. డిజైన్ టెక్ కు విడుదల చేసిన నిధులు మళ్ళీ షెల్ కంపెనీ ల ద్వారా బాబు గారి కి చేరాయి అని మీరు తెలిపే సమయం లో మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ను కోర్టు ముందు ఎందుకు పెట్టడం లేదు?
షెల్ కంపెనీ ల పేర్లు, ఆ కంపెనీ లు ఎవరి పేరు మీద ఉన్నాయి, వాటి డైరెక్టర్ లు ఎవరు?వాటి కి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా? ఉంటే డిజైన్ టెక్ ద్వారా డబ్బు లు ఆ ఖాతా లో కీ వచ్చాయా? వచ్చిన డబ్బులు బాబు గారి కి అందినట్లు మీ దగ్గర ఉన్న ఋజువులు ఏవి? Siemens CEO (India) ఈ ప్రాజెక్ట్ ఒప్పందాల పై సంతకం పెట్టినది వాస్తవం కాదా?స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంత మంది విద్యార్థులు లబ్ధి పొందారు.
వారికి అయిన ఖర్చు ఎంత?ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? అసలు ఈ పథకం లో ఎలాంటి అవినీతి జరగలేదు అనే విషయం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తెలుసు అని, బాబు గారికి,లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారి యాత్రలకు వస్తున్న ఆదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి నీచ రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు అని వక్తలు ప్రసంగించారు.
జనసేన నాయకులు మాట్లాడుతూ.. మా నాయకుడి నిర్ణయం మాకు శిరోధార్యం అని నీతి వంతమైన రాజకీయాలు చేసిన బాబు గారికి నీతి, నిజాయితీ గల మా నాయకుడు మద్దతు ఇచ్చారు అని నాయకులు తెలిపారు. భవిష్యత్ లో అన్ని కార్యక్రమాలను రెండు పార్టీ లు కలిసి చేస్తాయి అని, ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం వైసీపీ పాలకులను ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నీ ఓడిస్తాము అని తెలిపారు.
ఈ కార్యక్రమంలోటిడిపి సీనియర్ నాయకులు సుబ్బారాయుడు, బాలకృష్ణ, భాస్కర్, శ్రీనివాస్, చిన్నరాజు, గుండయ్య నాయుడు, ప్రధాన కార్యదర్శి మల్లి మారోతు, రాచూరి మోహన్, రమేష్,హేమంత్, ముస్తాక్, రెడ్డయ్య చౌదరీ, నలుగురు గవర్నరెట్ కమిటీ సభ్యులు, బీసీ అధ్యక్షులు శంకర్ యాదవ్, మహేష్, పెంచలయ్య యాదవ్, నరసింహ, శివా, తెలుగు యువత మురళి, శీను, జనసేన నాయకులు హరి రాయల్, చంద్ర శేఖర్, అలీ, జిలకర మురళి, పత్తి సుబ్బారాయుడు, గంటా సురేష్, కోనసీమ రాజేష్, మరియు టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు.