Connect with us

Politics

మేము సైతం చంద్రబాబుకి తోడుగా అంటూ NRI TDP Kuwait సంఘీభావం

Published

on

గౌరవనీయులు,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ మేము సైతం బాబు గారికి తోడుగా అనే కార్యక్రమాన్ని NRI TDP Kuwait ఆధ్వర్యంలో ఓమెరియా పార్క్ లో శుక్రవారం సాయంత్రం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియ చేస్తూ భవిష్యత్ మరిన్ని కార్యక్రమాలు కలిసి చేద్దామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు శ్రీ వెంకట్ కోడూరి గారు మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత, సాంకేతిక విప్లవం తెచ్చిన నాయకుడు,యువత కు ఉద్యోగాల రూపకల్పన లో అహర్నిశలు శ్రమించిన నాయకుడి కి ఈ రోజు రాష్ట్రం లో ఉండే వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోరమైన అవమానం చరిత్రలో నిలిచిపోతుంది అని, భవిష్యత్ లో విదేశీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందు రావని తెలిపారు. దీని వల్ల వారు బాబు గారిని జైల్ లో పెట్టాము అని పైశాచిక ఆనందం పొందుతున్నారు తప్ప యువత భవిష్యత్ పై దెబ్బ కొట్టాము అనే నిజాన్ని వారు గ్రహించలేక పోతున్నారు అని తెలిపారు.

ప్రభుత్వం దగ్గర బాబు గారు నిధులు పక్క దారి పట్టించాడు అనే ఆధారాలు ఉంటే కోర్టులో సాక్ష్యాధారాలు చూపించాలని, అవి చూపించకుండా సజ్జల గారి స్క్రిప్ట్ తీసుకొని సీఐడీ చీఫ్ మాట్లాడటం ప్రజాస్వామ్యన్ని అపహస్యం చేయడమే నని తెలిపారు. మా నాయకుడు ఎటువంటి తప్పు చేయరు అని, ఆయన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని, రాజ్యాంగాన్ని గౌరవించే నాయకుడు అని తెలిపారు.

జనసేన (Jana Sena) నాయకులు జిలకర మురళి గారు, అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలుపుతూ మురళి గారు మాట్లాడుతూ.. ఒక సీనియర్ రాజకీయ నాయకులు, 14సంవత్సరాల ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి నీ ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకున్నా అరెస్ట్ చేయడం చట్టాన్ని అపహస్యం చేయడమేనని తెలిపారు. మీ దగ్గర ఋజువులు ఉంటే ప్రజలకు తెలపాలని, కక్ష్య సాధింపు రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధి కి, భవిష్యత్తుకు మంచివి కావు అని ప్రభుత్వానికి హితువు పలికారు.

తమ నాయకుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు వచ్చే ఎన్నికల్లో ప్రజల కోసం చిత్తశుద్ధితో టీడీపీకి మద్దతుగా ఉంటామని, కలిసి ఎన్నికల్లో పోరాడి ఈ సైకో ప్రభుత్వంను గద్దె దింపుతాం అని తెలిపారు. ప్రధాన కార్య దర్శి మల్లి మారోతు గారు మాట్లాడుతూ.. ఈ రాజకీయ ఉన్మాది రాష్ట్రం లో కక్ష్యా రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష నేత లను అరెస్ట్ చేయడం మాని రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది అని తెలిపారు.మా నాయకుడు కడిగిన ముత్యం లా బయటకు వస్తాడు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు వెనిగళ్ల బాలకృష్ణ, పిడికిటి శ్రీనివాస్, మల్లారపు భాస్కర్, కత్తి సుబ్బారాయుడు, చిన్న రాజు గార్లు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు మోహన్ రాచూరి, రమేష్ కొల్లపనేని, ఓలేటి రెడ్డయ్య, గుండయ్య నాయుడు, మహేష్, శ్రీకాంత్ చింతల, రాజేష్,హేమంత్ రాయల్, శ్రీను రాయల్ మరియు నలుగురు గవర్నరెట్ సభ్యులు పాల్గొన్నారు.

అలాగే మైనార్టీ నాయకులు ముస్తక్ ఖాన్, అర్షద్, కరీం, బీసీ అధ్యక్షులు శంకర్ యాదవ్, కాపు సంఘం నాయకులు, తెలుగు యువత అధ్యక్షులు మురళి దుగ్గినేని, శ్రీను నాయుడు, మురళి కేశినేని పరిటాల ట్రస్ట్ నరసింహులు గారు, మహిళా నాయకురాలు నారాయణమ్మ,నిర్మలమ్మ గార్లు మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని తమ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి తమ సంఘీభావం తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected