సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి వివిధ విభాగాలను సమయుత్తం చేసే పనిలో భాగంగా గా ఎన్నారై టీడీపీ ఐర్లాండ్ విభాగం ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం, నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటంలో ఎన్నారైల పాత్ర మీద ఐర్లాండ్ వేదికగా మేధోమధన సదస్సు జరిగింది. ఈ సన్నాహక సమావేశానికి ఐర్లాండ్ వ్యాప్తంగా ఉన్న ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై దిగ్విజయం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై టీడీపీ విభాగం అధిపతి రవి వేమూరు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ Europe వ్యాప్తంగా ఎన్నారై టీడీపీని బలోపేతం చేయటం, ఇక్కడి ఎన్నారై సేవలను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఎలా వినియోగించుకోబోతుందనే విషయాలను వివరించారు. అలాగే పార్టీలో ఎన్నారైల పాత్రతో పాటు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నారైలకి భాగస్వామ్యం, పార్టీ సభ్యత్వ నమోదులోనూ ఎన్నారై టీడీపీ ఏ విధంగా పార్టీకి అదనపు బలంగ నిలుస్తుందో వివరిస్తూ జరిగిన సదస్సు లో ఎన్నారైల లో మరింత ఉత్సుకత పరిచే విధంగా గా సాగింది.
ఐర్లాండ్ టీం చేస్తున్న వివిధ కార్యక్రమాలని రవి వేమూరి గారికి డాక్టర్ కిషోర్ బాబు చలసాని గారు వివరించారు. యువగళం లో చేస్తున్న వివిధ కార్యక్రమాలు అలానే యూరోప్ దేశాలు అయిన ఐర్లాండ్, స్విట్జర్లాండ్, నెథర్లాండ్స్, డెన్మార్క్, నార్వే, బెల్జియం, స్వీడన్, మల్ట, ఇటలీ, ఫిన్లాండ్, హంగరీ వంటి వివిధ మిత్ర దేశాల తో సమన్వయం చేసుకుంటూ యువగలం కార్యక్రమానికి మరియు వాలంటీర్స్ కు ఉడత భక్తి గా సహాయ సహకారాలు అందిస్తున్నాం, దాని తో పాటు వివిధ సామజిక కార్యక్రమాలని వివరించారు.
రాబోయే రోజుల్లో యూరోప్ లోని వివిధ దేశాల లో ఉన్న ఎన్నారై టీడీపీ కలిసి తాము చేసిన చెయ్యబోతున్న కార్యక్రమాలని వివరించారు. 2024 లో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి ని చెయ్యటనికి శక్తి వంచన లేకుండా అహర్నిశలు కష్టపడతాము అని సభాముఖం గ వివరించారు. ఐర్లాండ్ టీం నుంచి కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు అభినందనలు అలానే రానున్న రోజుల్లో మనము అందరమూ ఇంకా కస్టపడి పని చెయ్యాలి అని అలానే ఎలక్షన్స్ టైం కి సాధ్యమయినంత మంది ఎన్నారై టీడీపీ సభ్యులు ఇండియా వెళ్లి మన వంతు సహాయం చెయ్యాలి అని వివరించారు.
ఈ కార్యక్రమం లో ఎన్నారై టీడీపీ ఐర్లాండ్ తరుపు నుండి అధ్యక్షులు భారత్ భాష్యం మరియు ముఖ్య ఆఫీస్ బ్యారెర్స్, కార్యవర్గ సభ్యులు, అధికార ప్రతినిధులు శ్రీనివాస్ పుత్త, రంగా గల్లా, శివ బాబు వేములపల్లి, అచ్చుత కిషోర్ కొత్తపల్లి, కోటెంద్ర లెళ్ళ, విజయ్ కృష్ణ చందోలు, సాయి పవన్ శర్మ, రామ్ వంగవోలు, రామకృష్ణ ఏలూరు, శుభకర రమినేని, జగన్ రెడ్డి ముత్తుముల, వెంకట్రావు, భగత్ మరియు యాబై పైగా ప్రతినిదులు హాజరు అయ్యి వాళ్ళ అభిప్రాయాలు పాలుపంచుకున్నారు.