Connect with us

Politics

NRI TDP Gulf Council & NRI TDP Kuwait ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు విజయవంతం

Published

on

యన్.ఆర్.ఐ తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ మరియు యన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ వారు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తులో భాగంగా టిడిపి గెలుపే ధ్యేయంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ గురించి సూచనలు చేయుటకు జూమ్ వేదికగా అవగాహన సదస్సు ఆగష్టు 12, 2022 శుక్రవారం రోజున నిర్వహించారు.

ఈ సమావేశానికి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, కడప పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిది మద్దిపట్ల సూర్యప్రకాశ్ గారు, పశ్చిమ రాయలసీమ పట్ట బధ్రుల MLC అభ్యర్ధి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు అని యన్.ఆర్.ఐ తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ గారు తెలియచేసారు.

ఓట్ల ప్రాధాన్యత అంటే ఏమిటి, ఈ ప్రాధాన్యత ఓటు ఎలా వేయాలి, ఈ ప్రాధాన్యతలను ఓటర్ ఎలా ఇచ్చుకుంటూ వెళ్లాలి, ఈ ప్రాధాన్యతలను ఇవ్వకపోతే జరిగే లాభ నష్టాలను చక్కగా వివరించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్ ప్రసాద్ గారు తెలియచేశారు.

ఓటర్లుగా నమోదు ఎలా చెయ్యాలి, డిగ్రీ చదువుకున్న వారి ఓట్లు, టీచర్ల ఓట్లు వేల సంఖ్యలో చెల్లకుండా పోవటానికి కారణాలేంటి, ఈ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఇలా జరగకుండా వుండడానికి ఓటర్లకు సూచనలు, సలహాలు గురించి వివరించడానికి సమావేశానికి అధ్యక్షత వహించిన యన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు అక్కిలి నాగేంద్రబాబు తెలియచేశారు.

యన్.ఆర్.ఐ తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ మెంబర్స్ కువైట్ నుండి వెంకట్ కోడూరి, ఖతార్ నుండి సత్య నారాయణ, ఒమ్మాన్ నుండి హరిబాబు నల్లీ, బహ్రెయిన్ నుండి హరిబాబు గారు అదే విధంగా గల్ఫ్ దేశాల టిడిపి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సోషల్ మీడియా ఇంచార్జులు, కోశాధికారులు మరియు గల్ఫ్ దేశాలకు సంబందించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పెరుపేరునా సభాధ్యక్షులు అక్కిలి నాగేంద్రబాబు ధన్యవాదాలు తెలియచేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected