Chicago, August 3, 2025: తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ NMD ఫిరోజ్ తో ఎన్నారై టీడీపీ చికాగో విభాగం వారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆగష్టు 3 ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్లైన్ ఫీల్డ్ (Plainfield, Illinois) లోని కానూరు ఫార్మ్ హౌస్ వేదికగా నిలించింది.
ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. అందరూ నంద్యాల అసెంబ్లీ పరిధిలోని NMD ఫరూక్ కుమారుడు అయినటువంటి NMD ఫిరోజ్ తో ఉత్సాహంగా ఫోటోలు దిగారు.