Connect with us

Politics

ఎన్నారై టీడీపీ చార్లెట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published

on

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి సరిగ్గా 40 సంవత్సరాలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమెరిగాలోని 40 నగరాల్లో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇండియా మరియు అమెరికాలోనే కాకుండా యూరప్,యూకే, గల్ఫ్ దేశాల్లో కూడా వేడుకలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఎన్నారై టీడీపీ చార్లెట్ ఆధ్వర్యంలో మార్చి 28న 40 వసంతాల పసుపు పండుగను పెద్ద ఎత్తున నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చిన ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అంటూ నిర్వహించిన ఈ వేడుకల్లో 150 మందికి పైగా తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

సాధారణంగా అమెరికాలో వర్కింగ్ డేస్ లో అందునా రాజకీయ పార్టీ కార్యక్రమానికంటే పెద్దగా ఆసక్తి చూపరు. అలాంటిది స్థానిక మార్విన్ క్రీక్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకలకు పెద్దలు, మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషమే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధా కృష్ణ హాజరయ్యారు.

ఉదయం నాగ పంచుమర్తి ఆరిమిల్లి రాధా కృష్ణ కి తన స్నేహితులు రమణ అన్నె మరియు రఘు కొత్తపల్లి లతో కలిసి విమానాశ్రయంలో స్వాగతం పలుకగా, సాయంత్రం కార్యక్రమం దగ్గిర చార్లెట్ వాసి, తెలుగుదేశం పార్టీ మహిళా అభిమాని మాధురి ఏలూరి మరియు వారి స్నేహిత బృందం పుష్పగుచ్ఛంతో సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆహుతులనుద్దేశించి ఆరిమిల్లి రాధా కృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన ప్రభుత్వ పధకాలు, ఇంజనీరింగ్ కళాశాలల వల్ల బాగా చదువుకొని అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో స్థిరపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో మిగిలిపోయిన వారందరూ బహుశా సరిపడా చదువు లేకపోవడం వల్ల గానీ లేక ఇతర పార్టీలు చేసే కుటిల అవినీతి అసంబద్ధ పనుల వల్ల గానీ తెలుగుదేశం పార్టీ విలువను ఈ మధ్యకాలంలో గుర్తించలేకపోయారనీ అన్నారు. కాబ్బట్టి మీరందరూ మీ ఊర్లలో వారికి అర్ధమయ్యేలా వివరించి 2024 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకోవాలని దిశా నిర్దేశం చేసారు.

అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మరియు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆన్ లైన్లో వేడుకలలో పాలుపంచుకున్నారు. వీరందరూ గొప్ప డైనమిక్ నాయకులవడంతో అహులందరూ వారి ప్రసంగాలను ఆద్యంతం శ్రద్ధగా ఆలకించారు. వీరితోపాటు నరసాపురం నియోజకవర్గ నేత మోహన్ కవ్వలి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జూమ్ మీటింగ్ ద్వారా నాయకులందరూ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు రీల్ స్టార్ నుంచి రియల్ స్టార్ ప్రస్థానం, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం, రాజకీయ విలువలు, అనంతరం నారా చంద్రబాబు నాయుడు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి, పారదర్శక పరిపాలన తదితర విషయాలపై ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీని 2024లో తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి, చంద్రబాబు ని మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో తిరిగి కాలు పెట్టించాలని, దీనికి ఎన్నారైలు నడుము కట్టి, వ్యూహాత్మకంగా ఇండియాలో ఉన్న తమవారిని సన్నద్ధం చేయాలని చార్లెట్ ఎన్నారై టీడీపీ కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపారు.

అనంతరం స్థానిక నాయకులు కొందరు ప్రసంగించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ కట్ చేసి అందరూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేదికనంతటినీ కూడా పసుపు మయం చేయడమే కాకుండా జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలుగుదేశం అంటూ నినాదాలతో వేదిక ప్రాంగణాన్ని మార్మోగించారు.

ఎన్నో వ్యయప్రయాసలనోర్చి కేవలం తెలుగుదేశం పార్టీ మీదున్న పిచ్చి అభిమానంతో ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన చార్లెట్ టీడీపీ నాయకులు నాగ పంచుమర్తి, రమణ అన్నె, చందు గొర్రెపాటి, శ్రీనివాస్ పాలడుగు, బాలాజీ తాతినేని, వెంకట్ వర్దినేని, బాలు కే, నాగుబోయిన బ్రదర్స్, నితిన్ కిలారు, రంగనాథ్ వీరమాచినేని లను ఆహూతులందరూ అభినందించారు.

ఈ వేడుకల వేదిక చార్లెట్ నగరానికి దక్షిణ దిక్కున ఉండడం వలన ఉత్తర దిక్కున ఉన్న చార్లెట్ వాసులకు బాగా దూరంగా ఉన్నప్పటికీ, అందునా వర్కింగ్ డే అయినప్పటికీ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు అహులందరికీ పేరు పేరునా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా విందు భోజనాలతో కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected