Connect with us

News

జయరాం కోమటి ఆధ్వర్యంలో NRI TDP అసెంబ్లీ కోఆర్డినేటర్స్ నియామకం

Published

on

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కి అమెరికా ప్రవాసులలో ఎక్కువ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు చేసేటప్పుడు గాని, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కార్యక్రమాలు వంటివి నిర్వహించేటప్పుడు గాని ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

అందుకే ఎన్నారై టీడీపీ యూఎస్ఏ (NRI TDP USA) ఏర్పాటు, అలాగే వివిధ నగరాల్లో ఎన్నారై టీడీపీ చాఫ్టర్స్ ఏర్పాటు చేసుకొని విస్తృతంగా పనిచేస్తుంటారు. జయరాం కోమటి ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ గా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నియమించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పుడు జయరాం కోమటి (Jayaram Komati) అమెరికాలోని ప్రవాసులలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వారిని ఐడెంటిఫై చేసి పార్లమెంట్ నియోజకవర్గాల పరంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నారై టీడీపీ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ ని నియమించారు. ఈ మేరకు లెటర్ హెడ్ పై వారి వివరాలు మీడియాకి రిలీజ్ చేశారు.

నిన్న డిసెంబర్ 16, శనివారం రోజున 6 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నారై టీడీపీ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ (NRI TDP Assembly Coordinators) ని ప్రకటించారు. ముందు ముందు మరిన్ని నియోజకవర్గాలకు ప్రకటించనున్నారు. వీరందరూ వచ్చే 2024 ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాలలో సహాయపడేవిధంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో పనిచేయనున్నారు.

కీంద్రీకృతంగా సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేలా, నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ని ముఖ్యమంత్రిగా అసెంబ్లీ కి పంపేలా అడుగులు వేయనున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా కార్యాచరణ చేయనున్నారు.

ఈ సందర్భంగా వీరందరికీ ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ (NRI TDP USA Coordinator) జయరాం కోమటి అభినందనలు తెలియజేశారు. అందరూ వచ్చే 6 నెలలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కష్టపడి పనిచేయాలన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected