ఎన్‌ఆర్‌ఐలు పంపిన విదేశీ నగదు ప్రవాహం – భారతదేశ అభివృద్ధికి ఎనలేని తోడ్పాటు భారతదేశం 2023–24 ఆర్థిక సంవత్సరంలో USD 118.7 బిలియన్ (సుమారు ₹10 లక్షల కోట్లు) విదేశీ రిమిటెన్స్‌ను స్వీకరించి, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రిమిటెన్స్ (Remittance) అందుకునే దేశంగా నిలిచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన వాటా 4.4%. ఇది సుమారుగా USD 5.2 బిలియన్లకు (₹43,000 కోట్లకు) సమానం.
ఈ రిమిటెన్స్ వల్ల భారతదేశానికి లాభాలు: విదేశీ మారక నిల్వలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడింది. నిర్మాణ రంగం, విద్య, ఆరోగ్యం, మరియు చిన్నతరహా వ్యాపారాలు చురుకుగా మారాయి. దేశ ఆర్థిక స్థిరత్వం బలపడింది. దేశీయ వినియోగ శక్తి పెరిగింది.
మోదీ నాయకత్వం వల్ల దేశంలో పెరిగిన స్థిరత్వం
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, దేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించింది. మోదీ నాయకత్వంలోని పారదర్శక పాలన, అభివృద్ధి కేంద్రీకృత విధానాలు, ఐటీ & డిజిటల్ (IT & Digital) విప్లవం, సులభమైన పెట్టుబడి వాతావరణం, ఆత్మనిర్భర్ భారత్, ఉజ్వల విదేశాంగ విధానం – ఇవన్నీ భారతదేశాన్ని ఒక ప్రగతిశీల, విశ్వసనీయ దేశంగా నిలిపాయి.
ఈ స్థిరతతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు భారతదేశ (India) భవిష్యత్తుపై గట్టి నమ్మకం కలిగి ఉండి, తమ సంపాదనను తమ మాతృభూమికి పంపుతున్నారు. ఇది దేశ నిర్మాణానికి అంకితంగా ఉన్న వారి ప్రేమకు, బాధ్యతకు నిదర్శనం.
ఎన్‌ఆర్‌ఐలకి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ (NRI) కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ స్వేదంతో సంపాదించిన డాలర్లు, దిర్హామ్లు, పౌండ్లు, డాలర్లు — ఇవన్నీ ఈ మాతృభూమి అభివృద్ధికి సాలెమల్లెలు. మీ త్యాగం వల్లే విదేశాల్లో చదువుతున్న తమ్ముళ్లకు, ఇండియా (India) లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దలకు, గ్రామాల్లో ఇళ్లు కడుతున్న కుటుంబాలకు వెలుగులున్నాయి.
మీ సేవ భారతదేశానికి శక్తి, మీ ప్రేమ మాతృభూమికి మద్దతు, మీ నమ్మకం భారతదేశ భవిష్యత్తుకు మార్గదర్శకం. ప్రచురించిన సంస్థలు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (6వ India Remittance Survey, 2024), Drishti IAS – India’s Remittance Trends 2024, Voronoi App, Dataful, NPCI, Visual Capitalist
– Suresh Karothu