Connect with us

Donation

బాలికల హాస్టల్ నిర్మాణానికి తానా ఫౌండేషన్ మాజీ ట్రస్టీ 10 కోట్ల విరాళం @ Andhra Pradesh

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మాజీ ట్రస్టీ కుటుంబం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని బాలికల వసతి గృహానికి 10 కోట్లు దానం చేశారు. 2003-05 కాలంలో తానా (TANA) ఫౌండేషన్ ట్రస్టీ గా సేవలందించిన బాబురావు కాజా (Babu Rao Kaja) మరియు భార్య డా. జానకి కాజా కలిసి ఈ విరాళం అందించారు.

ఏలూరు జిల్లా (Eluru District), ఆగిరిపల్లి మండలం, తోటపల్లి హిల్ ప్యారడైజ్ లో 30 కోట్లతో నిర్మిస్తున్న ఈ హీల్ బాలికల హాస్టల్ కు గత డిసెంబర్ లో కుటుంబసమేతంగా శంకుస్థాపన చేశారు. అమెరికాలోని మిడ్-అట్లాంటిక్ ప్రాంతంలోని డెలావేర్ రాష్ట్ర రాజధాని డోవర్ (Dover, Delaware) నగరానికి చెందిన ఈ ఎన్నారై దంపతులను అందరూ అభినందిస్తున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected