డిసెంబర్ 19, తాడేపల్లి, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు సమితి (North American Telugu Association) ‘నాటా’ మహాసభలు వచ్చే 2023 జూన్ 30 నుండి జులై 2 వరకు డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కిక్ ఆఫ్ ఈవెంట్లో 2.7 మిలియన్ డాలర్ల విరాళాలు కూడా రైజ్ చేశారు.
ఎప్పటి లానే ఈ మహాసభలకు ముందు కూడా ఇండియాలో నాటా డేస్ అంటూ పలు నగరాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే పలువురు ప్రముఖులను కలిసి నాటా మహాసభలకు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు నాటా అధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి (Dr. Sridhar Reddy Korsapati) అధ్యక్షతన నాటా లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు.
టెక్సస్ (Texas) రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) నగరంలో నిర్వహించే నాటా మహాసభలకు తప్పకుండా రావాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు వినికిడి.
ఇదేగనక జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Yeduguri Sandinti Jagan Mohan Reddy) మొట్టమొదటిసారి అమెరికాలో తెలుగు సంఘం మహాసభలకు విచ్చేసినట్టవవుతుంది. అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.