Connect with us

Financial

ఆర్ధిక అవగాహన, విలువైన సూచనలు @ NATS New Jersey Chapter సదస్సు

Published

on

Edison, New Jersey: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న North America Telugu Society (NATS) న్యూజెర్సీ చాప్టర్, శనివారం నాడు ఆర్ధిక అవగాహన సదస్సు నిర్వహించింది. న్యూజెర్సీలో ఉండే తెలుగు వారికి ఆర్ధిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏజీ ఫిన్ టాక్స్ (AG FinTax) సీఈఓ అనిల్ గ్రంధి తెలుగువారికి ఎన్నో విలువైన ఆర్ధిక సూచనలు చేశారు.

అమెరికాలో పన్నులు (Taxes), ఉద్యోగం చేసే వారికి ఎలాంటి పన్ను మినహాయింపులు (Tax Exemptions) ఉన్నాయి? అకౌంటింగ్‌ (Accounting) లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక పన్నుల నుంచి తప్పించుకోవచ్చు? వ్యాపారాలు చేసే వారు పన్నుల విషయంలో ఎలా వ్యవహారించాలి? వంటి అంశాలను  అనిల్ గ్రంధి (Anil Grandhi) చక్కగా వివరించారు.

ఈ  సదస్సులో పాల్గొన్న వారు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ ఆర్ధిక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడంలో North America Telugu Society (NATS) ప్రెసిడెంట్ ఎలక్ట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi) కీలక పాత్ర పోషించారు. తెలుగువారికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నాట్స్  చేపడుతుందని ఆయన అన్నారు.

భవిష్యత్తులో కూడా NATS విద్య, వైద్యం, ఆర్ధికం, క్రీడలు ఇలా ఎన్నో అంశాలపై కార్యక్రమాలు చేపట్టనుందని శ్రీహరి మందాడి వివరించారు. నాట్స్ బోర్డు డైరెక్టర్ బిందు ఎలమంచిలి, వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) శ్రీనివాస్ భీమినేని, నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్) కిరణ్ మందాడి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట పలు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు.

NATS New Jersey Chapter నుండి మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీకాంత్ పొనకాల,వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, వర ప్రసాద్ చట్టు, జతిన్ కొల్ల, బ్రహ్మనందం పుసులూరి,  బినీత్  చంద్ర  పెరుమాళ్ళ, ధర్మ ముమ్మడి, అపర్ణ గండవల్ల,  రమేష్  నూతలపాటి, రాజేశ్  బేతపూడి, గోపాల్ రావు చంద్ర లు  పలు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు.

ఈ ఆర్ధిక అవగాహన సదస్సు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ (North America Telugu Society – NATS) చైర్మన్  ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) మరియు నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.