ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అంతర్జాల వేదికగా జాతీయ స్థాయిలో చదరంగం కార్యశాలను నిర్వహించింది. విద్యార్ధుల్లో సృజనాత్మకతను, ఏకాగ్రతనుపెంపొందించే చదరంగంపై నిర్వహించిన కార్యశాలకు అనూహ్య స్పందన లభించింది. వందలాది మంది తెలుగు విద్యార్ధులు ఈ కార్యశాలను వినియోగించుకుని చదరంగంలో మెళకువలు నేర్చుకున్నారు. అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్స్ ఆధ్వర్యంలోని కింగ్స్ చెస్ అకాడమీ ఎన్నో విలువైన పాఠాలు బోధించింది.
కింగ్స్ చెస్ అకాడమీ శిక్షకులు సాకేత్ పెదగంధంతో వారి బృందం సెప్టెంబరు 17 నుండి అక్టోబర్ 9 వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించింది. అంతర్జాలం ద్వారా అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో వందలాది విద్యార్ధులు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. చదరంగ నిపుణులు చెప్పిన విలువైన పాఠాలు వినటంతో పాటు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
నాట్స్ నిర్వహించిన ఈ చదరంగ శిక్షణ తరగతులు పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ఇందులో పిల్లలు ఎన్నో మెళకువలను నేర్చుకున్నారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చదరంగ శిక్షణ తరగతుల నిర్వహణలో నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి, నేషనల్ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ దిలీప్ సూరపనేని, స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగతావుల, సెక్రెటరీ రంజిత్ చాగంటి, జాయింట్ సెక్రటరీ జ్యోతి వనం తదితరులు కీలక పాత్ర పోషించారు.
నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ చిలుకూరి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మీడియా మురళి మేడిచర్ల, నేషనల్ కో ఆర్డినేటర్ ప్రోగ్రామ్స్ రాజేష్ కాండ్రు తదితరులు ఈ చదరంగ శిక్షణకు తమ వంతు సహకారాన్ని అందించారు. నాట్స్ చేపట్టిన చదరంగ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ ఛైర్ ఉమన్ అరుణ గంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని పాఠాల వీడియోస్ కోసం www.NRI2NRI.com/NATSChessWorkshop ని సందర్శించండి.