తానా ఎలక్షన్స్ లో భాగంగా ఈమధ్య కోమటి జయరాం మాట్లాడుతూ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శృంగవరపు నిరంజన్ తానాలో కేవలం 5 సంవత్సరాల నుంచే ఉన్నట్లు మరియు అధ్యక్ష పదవికి ఆత్రుత పడుతున్నట్లు మీడియా ముఖంగా వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈ విషయమై ఎన్నారై 2 ఎన్నారై మరింత అధ్యయనం చేయగా శృంగవరపు నిరంజన్ తానా సర్వీస్ హిస్టరీని సాధించగలిగింది. ఇవిగో డీటెయిల్స్ మీకోసం.
2019-2021: తానా ఫౌండేషన్ ఛైర్మన్, బోర్డు సభ్యుడు, బైలా కమిటీ, సభ్యత్వ ధృవీకరణ కమిటీ, పెట్టుబడుల కమిటీల్లో సభ్యుడు.
2017-2019: తానా ఫౌండేషన్ ట్రస్టీ
2017-2018: తానా ఫౌండేషన్ ఛైర్మన్
2015-2017: తానా ఫౌండేషన్ కోశాధికారి
2013-2015: తానా ఫౌండేషన్ ట్రస్టీ
2013-2015: డెట్రాయిట్‌లో జరిగిన 20వ తానా మహాసభల కోశాధికారి
2009-2011: తానా నిధుల సేకరణ కమిటీకి అధ్యక్షుడు.
కాబట్టి 2021 మైనస్ 2009 ని తక్కువలో తక్కువగా చూసుకున్నా 5 కాదు కదా, ఏమో బీకామ్ లో ఫిజిక్స్ లెక్కల్లో 5 అయ్యుండొచ్చు అని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.