
సెప్టెంబర్ 9 న ఎన్నారై తెలుగుదేశం పార్టీ మరియు నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో ఉత్తర కరోలినా రాష్ట్రం లోని షార్లెట్ నగరంలో సమైఖ్యఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రవాసులు మల్లినేని ఠాగూర్, పంచుమర్తి నాగా, కిలారు నితిన్, కావూరి సాయి, జాగర్లమూడి సురేష్, నాళ్లా నాగ, ఏలూరి మాధురి, గొర్రెపాటి చందు, కంఠమనేని పట్టాభి, వీరమాచినేని రంగనాథ్ తదితరులు పాల్గొని తండ్రికి తగ్గ తనయులు, ఎన్టీఆర్ చైతన్య రధసారధి హరికృష్ణతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

