బోస్టన్, అక్టోబర్ 2, 2021: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ న్యూ ఇంగ్లండ్ విభాగం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి, మాన్ ఆఫ్ పీస్ లాల్ బహదూర్ శాస్త్రి 117 వ జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక షెర్బోర్న్ నగర గాంధీ విగ్రహ ప్రాంతం ఈ కార్యక్రమానికి వేదికైంది.
మహాత్మాగాంధీ యావత్ ప్రపంచానికి చూపిన అహింసా మార్గం స్ఫూర్తితో ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వయొలెన్స్ యావత్ ప్రపంచం పాటించటం జాతి పిత గొప్పతనమన్నారు. జాతిపిత చూపిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలు మన ముందు తరాల వాళ్ళకి విశదీకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అని గుర్తు చేసుకున్నారు.
తానా న్యూ ఇంగ్లండ్ విభాగం ప్రతినిధి ప్రదీప్ గడ్డం మాట్లాడుతూ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి నాయకత్వంలో గాంధీ మార్గాన్ని అనుసరించి పలు సేవా కార్యక్రమాలు తానా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమం తానా న్యూ ఇంగ్లండ్ విభాగం ప్రతినిధి ప్రదీప్ గడ్డం ఆధ్వర్యంలో నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహ వ్యవస్థాపకులు “లూయిస్” సభ్యులు సూర్య తేలప్రోలు, కంతేటి శ్రీనివాస్, అబ్దుల్ కలాం, కేపీ సోంపల్లి, దినేష్ గోకవరపు, విక్రాంత్ సూర్యదేవర, రామకృష్ణ మాదాల మరియు హర్షద్ గుంటక తదితరులు ఈ జయంతి వేడుకలలో పాల్గొన్నారు.