ప్రతిష్టాత్మకంగా జరిగిన తానా ఎన్నికలలో ప్రత్యర్ధుల వ్యుహలన్నీ పటాపంచలు చేసి, డెట్రాయిట్ (Detroit) వాసి నీలిమ మన్నె అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. సుమారు 18 సంవత్సరాల తరువాత, తానా నార్త్ ప్రతినిధిగా మళ్ళీ మహిళ ఎన్నిక కావటం ఒక విశేషమైతే, ప్రస్తుత తానా (TANA) అధ్యక్షుని ప్రాంతంలో ప్రత్యర్ఢిని సునాయాసంగా ఓడించటం మరో విశేషం.
గతంలో నీలిమ మన్నె స్థానిక డెట్రాయిట్ తెలుగు సంస్థ (Detroit Telugu Association) కు అధ్యక్షురాలిగానే కాక, డి.టి.ఏ 40 వసంతాల వార్షికోత్సవాల్లోను, ధీంతానా (DhimTANA) కోఆర్డినేటర్ గాను, తానా నార్త్ మహిళా విభాగ కోఆర్డినేటర్ గాను సేవలందించారు. అందరినీ కూడ గట్టుకుని ముందుకు వెళ్తున్న నీలిమ పనితనం ఆమె గెలుపుకి దోహదపడిందనటంలో సందేహం లేదు.
ఈ ఎన్నికల సందర్భంగా తానా మహిళా సభ్యులంతా, నీలిమ (Neelima Manne) ను గెలిచినందుకే కాకుండా, తన ధైర్య సాహసాలను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. తన గెలుపుకి కృషి చేసిన మిత్రులకి, తానా (Telugu Association of North America) సభ్యులకి ఈ సందర్భంగా నీలిమ కృతజ్ఞతలు తెలియ చేశారు.
తానా (TANA) ద్వారా మహిళల ఉన్నతికి, వారి ప్రత్యేక అవసరాలను తీర్చటానికి కృషి చేస్తానని నీలిమ తెలిపారు. జూలై 2023 లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని గౌరవించిన నీలిమ తన నామినేషన్ ఉపసంహరించుకుంది. కానీ కోర్టు కేసు వల్ల మళ్ళీ ఎన్నికలకు తెర తీశారు. ఈ ఎన్నికలలో నీలిమ మన్నె (Neelima Manne) విజయం సాధించడం విశేషం.