Connect with us

Celebrations

North Carolina Triangle Area లో ఘనంగా NDA కూటమి విజయోత్సవ వేడుకలు

Published

on

అమెరికా లోని నార్త్ కరోలినా ట్రయాంగిల్ ఏరియా (North Carolina Triangle Area) లో గత గురువారం జూన్ 13 వతేదీన విశాలమైన స్థానిక చాతం కౌంటీ ఎగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సెంటరులో టీడీపీ .. చారిత్రాత్మక పోరాటంతో.. నేను సైతం అంటూ.. అండగా నిలబడి, తలబడి చరిత్ర తిరగ రాసిన ప్రతి ఒక్కరికీ కూటమి పిలుపు నందివ్వగా.. ఇక్కడ విజయోత్సవ వేడుకలకి అశేష జన సందోహం కదలి వచ్చింది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అద్భుత విజయం సాధించిన సందర్భముగా NRI TDP Raleigh ఆధ్వర్యములో సంబరాలు అంబరాన్ని తాకాయి. సుమారు 100 కార్లు, బైకులతో ర్యాలీగా జయ జయ ధ్వనులతో అన్న నందమూరి తారక రామారావు (NTR) గారి సువర్ణ వర్ణ విగ్రహంతో సభా ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొనివచ్చి ప్రతిష్టించారు.

అన్నగారి (Nandamuri Taraka Ramarao) విగ్రహానికి ఆడబడుచులు దీపారాధనచేయగా, ప్రసాద్ కొమ్మరాజు గారి ప్రార్ధనా గీతాలతో సభ కన్నుల పండుగా ప్రారంభించారు. తదనంతరం ఇటీవల దివంగతులైన్ ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావు (Cherukuri Ramoji Rao) గారికి శిరీష్ గొట్టిముక్కల గారు సభాముఖంగా నివాళి అర్పించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust USA) నాయకులు గొట్టిపాటి శ్రీధర్ గారు, Raleigh NRI TDP (టీడీపీ) కమిటీ సభ్యులు శ్రీ ఆరెమండ శ్రీనివాస్, మాధవి ముప్పవరపు, రాజీవ్ తలసీల, నాగరాజు గొంది, శ్రీనివాస్ మురారిశెట్టి, శ్రీనాథ్ కడియాల, సురేష్ చలపాలి, రాలీ టీడీపీ నాయకులు పూర్ణచంద్ర కొండ్రగుంట, శిరీష్ గొట్టిముక్కల, రంజిత్ గొట్టిముక్కల, శ్రీ కొండపనేని, శ్రీకాంత్ యర్రగుంట, హరీష్ కన్నెగంటి, శ్రీనివాస్ మార్తాల, రావు ముక్కామల, శ్రీని రావు అనంత, ప్రవీణ్ పెద్ది, శ్రీనివాస్ వడ్లమూడి, గోపాల్ మన్నే, సాయి సుధాకర్ దాసరి, కోటి పురిటి, రాజేష్ పువ్వాడ, వంశి కృష్ణ ఆవుల, బీజేపీ (BJP) నాయకులూ శ్రీ డా. అడుసుమల్లి శంకర్ గారు, రాజ్ కూరపాటి గారు, జనసేన (JSP) నాయకులు శ్రీ కృష్ణ రెడ్డి గంగిరెడ్డి, నారాయణ్ చింతపట్ల, సన్నీ బత్తుల, రోహిత్ శీలంశెట్టి, సాయి నిడమర్తి ,శివ చదలవాడ, సురేష్ అంబటి, రవి కొవ్వలి , కుమార్ పేరాబత్తుల, నిరంజన్ పుజారా, తెలుగు మహిళా నాయకులూ కల్పనా గొట్టిపాటి, నిర్మల కోరిపెల్ల, శైలజ కొండ్రగుంట, విజిత గొట్టుముక్కల, శిరీష గన్నె, ఉష పర్వతనేని, నర్మదా వేలూరు, శైలజ సిద్దరాంపురం, రామ ఇడుపుగంటి, మాధురి లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి విచేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రముములో స్థానిక గాయనీ గాయకులు (Singers) ఉత్తేజ కరమైన, విజయోత్సాహ పూరితమైఅన అన్నగారి గీతములు ఆలపించారు. కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో ఇంత చక్కని కార్యక్రమాన్ని సంకల్పించి, విజయ వంతముగా నిర్వహించినందుకు అందరూ స్థానిక టీడీపీ (Telugu Desam Party) నాయకులను మనసారా అభినందించారు. కార్యక్రముము ఆద్యంతమూ రసవత్తరంగా సాగింది.

ఈ North Carolina విజయోత్సవ సభలో జూం మాధ్యమము ద్వారా భారతదేశం నుంచి గ్రామీణాభివృధ్ధి మరియు సమాచార శాఖా మంత్రి Dr. చంద్ర శేఖర్ పెమ్మసాని (Dr. Pemmasani Chandrasekhar) గారు నిర్వాహకులను అభినందిస్తూ NRI పారిశ్రమిక వేత్తలను ఆహ్వానించారు. శ్రీనివాస్, పూర్ణ గార్ల వందన సమర్పణతో విజయోత్సవ కార్యక్రమము దిగ్విజయముగా ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected