Edison, New Jersey, September 1, 2025: అమెరికాలో తెలుగు విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) అనేక కార్యక్రమాలు చేసడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫ్రమ్ యావరేజ్ టూ ఐవీ, శ్యాట్ (SAT) వర్సెస్ యాక్ట్ (ACT) షో డౌన్ పేరుతో వెబినార్ నిర్వహించింది.
ఈ వెబినార్‌లో దాదాపు 55 కుటుంబాలకుపైగా హాజరయ్యాయి. ఈ వెబినార్ (Webinar) ద్వారా తమ పిల్లల ఉన్నత విద్య భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనకు వచ్చాయి. నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi) నాయకత్వంలో, సుకేశ్ సబ్బాని సమన్వయకర్తగా ఈ వెబినార్‌ను నిర్వహించారు.
ప్రముఖ విద్యా నిపుణురాలు, ఎడ్యుఫిట్ టెస్ట్ ప్రిప్ వ్యవస్థాపకురాలు రీమా చితాలియా (Reema Chitalia) ముఖ్య వక్తగా హాజరయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో (University of Chicago) పూర్వ విద్యార్థిని అయిన రీమా, గతంలో డెలాయిట్ (Deloitte) సైబర్ రిస్క్ కన్సల్టెంట్‌గా పనిచేసిన అనుభవంతో పాటు, వేలాది మంది విద్యార్థులను శాట్, యాక్ట్ (ACT) పరీక్షల్లో ఉన్నత స్కోర్లు సాధించేలా మార్గనిర్దేశం చేశారు.
ఈ వెబినార్‌లో ఆమె డిజిటల్ శాట్ (SAT) పరీక్షలోని రెండు-మాడ్యూల్ వ్యవస్థ, ఐటెమ్ రెస్పాన్స్ థియరీ (ఐఆర్‌టి) స్కోరింగ్ విధానం, ఇంగ్లీష్, గణిత విభాగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే వ్యూహాలను వివరించారు. ముఖ్యంగా, విద్యార్థులు తమ విద్యా సంవత్సరంలో ఏ సమయంలో పరీక్షలు రాస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయో డేటా ఆధారిత వివరాలతో తెలిపారు.
పదో తరగతి మధ్యలో నుంచి పరీక్షలకు సిద్ధం కావడం అత్యంత విజయవంతమైన ఫలితాలకు దారితీస్తుందని రీమా (Reema Chitalia) వివరించారు. తల్లిదండ్రులు, విద్యార్ధుల నుంచి వచ్చిన ప్రశ్నలకు కూడా చక్కటి సమాధానాలు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ సమయాలు, ఎన్నిసార్లు పరీక్ష రాయాలి, ప్రిపరేషన్ టైమ్‌లైన్, కోచింగ్ ఎంపికల గురించి వ్యక్తిగత సలహాలు రీమా ఇచ్చారు.
“80/20 Rule” వంటి ఆచరణాత్మక వ్యూహాలను వివరించారు. ఈ వెబినార్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ (NATS) కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కిరణ్ మందాడి (Kiran Mandadi) ధన్యవాదాలు తెలిపారు. ఈ వెబినార్‌ను విజయవంతంగా నడిపించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రత్యేకంగా అభినందించారు.