Connect with us

Patriotism

ఆకట్టుకున్న నాట్స్ శకటం, ఉప్పొంగిన భారతీయత, రష్మిక & విజయ్ దేవరకొండ హాజరు @ New York, FIA India Day Parade

Published

on

New York, USA, August 19, 2025: న్యూయార్క్ నగరంలో ఎఫ్.ఐ.ఏ (Federation of India Associations – FIA) ఆధ్వర్యంలో జరిగిన 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ నేనుసైతం అంటూ పాల్గొని మాతృభూమి పట్ల మమకారాన్ని చాటింది.

నాట్స్ నాయకులు, సభ్యులు పాల్గొని జన్మభూమి పట్ల తమకు ప్రేమను ప్రదర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో తెలుగు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), ప్రముఖ నటి రష్మిక (Rashmika Mandanna) కూడా పాల్గొని ఈ పరేడ్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు.

ఈ ఉత్సవాల సందర్భంగా ఎఫ్.ఐ.ఏ (Federation of India Associations – FIA) ఏర్పాటు చేసిన ర్యాలీలో నాట్స్ (NATS) శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ కార్యక్రమంలో నాట్స్ (NATS) పూర్వ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల, బోర్డ్ డైరెక్టర్ వెంకట్ శాఖమూరి, నాట్స్ జాయింట్ సెక్రటరీ రామ్ నరేష్ కొమ్మనబోయిన, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల, నాట్స్ నాయకులు నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్) కిరణ్ మందాడి పాల్గొన్నారు.

అలాగే నాట్స్ నార్త్ ఈస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, న్యూ జెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ కుమార్ వెనిగళ్ల, కో- కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి, న్యూ జెర్సీ చాప్టర్ అడ్వైజర్ వంశీ కృష్ణ వెనిగళ్ల, శ్రీకాంత్ పొనకాల, శంకర్ జెర్రిపోతుల, శ్రీదేవి పులిపాక, గాయత్రి చిట్లేటి, గీత, కృష్ణ నెక్కంటి, రాకేష్ వేలూరు, సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, సురేష్ బొందుగుల, DJ శేఖర్ తదితరులు కూడా ఈ పరేడ్‌లో పాల్గొన్నారు.

నాట్స్ సభ్యులు, నాట్స్ (NATS) కుటుంబ సభ్యుల చిన్నారులు ఈ పరేడ్‌లో చేసిన ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తారిక, తన్వి లు చేసిన టాలీవుడ్ డాన్స్, సింధూర చేసిన క్లాసికల్ నృత్యం విశేషం గా ఆకర్షించాయి. రంగ మేడిశెట్టి చేసిన కృష్ణ వేషధారణ, భాగవత సందేశాలు కూడా అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.

భారత్ మాతా కీ – జై! వందేమాతరం! జై హింద్ వంటి నినాదాలతో న్యూయార్క్ (New York) నగరం హోరెత్తింది. మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. చక్కటి సమన్వయంతో న్యూ జెర్సీ (New Jersey), ఫిలడెల్ఫియా (Philadelphia) చాప్టర్స్ నుంచి వచ్చిన నాట్స్ మిత్రులందరికీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) అభినందనలు తెలియచేసారు.

error: NRI2NRI.COM copyright content is protected