ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా న్యూయార్క్ నగరంలో జరిగిన 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ‘నాట్స్’ నాయకులు, సభ్యులు పాల్గొని జన్మభూమి పట్ల తమ దేశభక్తిని మరోసారి చాటారు. నాట్స్ వినూత్న శకటంతో న్యూయార్క్ వీధుల్లో జై భారత్ నినాదాలు హోరెత్తాయి. అలాగే భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
ఈ పరేడ్ సందర్భంగా ఎఫ్.ఐ.ఏ ఏర్పాటు చేసిన ర్యాలీలో నాట్స్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. పలువురు నాట్స్ శకటం వద్ద సెల్ఫీలు తీసుకోవడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్ ఉమన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి, డిప్యూటీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, ఇమ్మిడియట్ పాస్ట్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, పాస్ట్ ఛైర్మన్ శ్యామ్ మద్దాలి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్స్ రాజ్ అల్లాడ, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, ఆది గెల్లి, వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగతావుల, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ గురు కిరణ్ దేసు, నాట్స్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ రామ్ కొమ్మనబోయిన, కిరణ్ తవ్వా తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఈ పరేడ్‌లో నాట్స్ నాయకులతోపాటు, స్థానిక తెలుగు సంస్థల సభ్యులు, డాన్స్ స్కూల్ పిల్లలు కూడా పాల్గొని ఆట పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమం ఆ సాంతం భారత్ మాతా కీ జై, వందేమాతరం, జై హింద్ వంటి నినాదాలతో న్యూయార్క్ నగరాన్ని హోరెత్తించింది. మరిన్ని ఫోటోలకు ఎన్నారై2ఎన్నారై.కామ్ లింక్ ని సందర్శించండి.