ఫిలడెల్ఫియా (Philadelphia), జనవరి 10: భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ విద్యార్ధుల్లో చిన్ననాటి నుంచే సేవా భావాన్ని పెంచేందుకు ముందుడుగు వేసింది.
ఫిలడెల్ఫియా (Philadelphia) లో నాట్స్ యూత్ కమిటీ నాయకురాలు అమృత శాఖమూరి ఆధ్వర్యంలో స్థానిక ది సిబీ సౌత్ హైస్కూల్ (Central Bucks South High School) యాక్టివిటీస్ కోసం విరాళాలు సేకరించారు. నాట్స్ ద్వారా సేకరించిన 6000 డాలర్ల విరాళాల చెక్కును సీబీ సౌత్ హైస్కూల్ ప్రిన్సిపాల్ జాసన్, హెచ్.బుచర్ కి అందించారు.
నాట్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులు శ్రీధర్ అప్పసాని, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్) హరినాథ్ బుంగటావుల, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వెంకట్ లతో కలిసి అమృత శాఖమూరి ఈ చెక్కును అందించారు. నాట్స్ ఇచ్చిన విరాళం సీబీ సౌత్‌లో కార్యకలాపాలకు చాలా దోహదపడతాయని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జాసన్ అన్నారు.
విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచేలా సీబీ సౌత్ (Central Bucks South High School) కోసం నాట్స్ (NATS) చేపట్టిన విరాళాల సేకరణను ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధుల్లో స్ఫూర్తిని నింపుతాయని సీబీ సౌత్ హైస్కూల్ ప్రిన్సిపాల్ జాసన్ ప్రశంసించారు.
నాట్స్ యువవాలంటీర్లను, కొత్త తరాన్ని సేవాపథం వైపు నడిపించేందుకు ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం (NATS Philadelphia Chapter) చేపట్టిన ఈ డోనేషన్ డ్రైవ్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేకంగా అభినందించారు.