Connect with us

Social Service

పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించేలా నాట్స్  Adopt-A-Street @ Frisco, Texas

Published

on

Frisco, Texas: భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా తన సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి 2 వ తేదీ ఆదివారం నాడు ప్రిస్కో, టెక్సాస్‌లో అడాప్ట్ ఏ స్ట్రీట్ (Adopt-A-Street) కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది.

తెలుగు విద్యార్ధుల్లో సామాజిక బాధ్యతను పెంచేందుకు నాట్స్ (North America Telugu Society – NATS) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 50 మందికి పైగా స్వచ్చంద సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని, టీల్ & లెగసీ మధ్య రెండు మైళ్ల దూరం ఉన్న ఫీల్డ్స్ పార్క్‌వే (Parkway) వీధిని శుభ్రం చేశారు. అందులో సగం మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం విశేషం.

పరిసరాల పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు నేర్పించగలగటం ముఖ్య ఉద్దేశ్యమని టెక్సాస్ నాట్స్ (NATS) సభ్యులు పేర్కొన్నారు. డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ , శ్రవణ్ నిడిగంటి లు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారరందరికి కృతజ్ఞతలు తెలిపారు.

డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) వారు చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలు స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమి, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, మరియు ఫార్మ్2కుక్ లకు డల్లాస్ చాప్టర్ సభ్యులు ధన్యవాదాలు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నాట్స్ (NATS) బోర్డ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల (Rajendra Madala), డల్లాస్ టీం అడ్వైజర్ కవిత దొడ్డ, నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర, నాట్స్ మీడియా రిలేషన్స్ నేషనల్ కోఆర్డినేటర్ కిషోర్ నారె, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, డల్లాస్ చాప్టర్ సభ్యులు బద్రి బియ్యపు, పావని నున్న, కిరణ్ నారె, శివ మాధవ్, వంశీ కృష్ణ వేనాటి, సాయిలక్ష్మి నడిమింటి మరియు ఇతర నాట్స్ డల్లాస్ సభ్యులు  పాల్గొన్నారు.  

నాట్స్ డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) సమాజ సేవలో ముందుండి, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు చేస్తున్న కృషిని నాట్స్ బోర్డ్ డైరెక్టర్, నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి (Bapu Nuthi) ప్రశంసించారు. అడాప్ట్ ఏ స్ట్రీట్ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అందరిని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati), నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) అభినందించారు. 

error: NRI2NRI.COM copyright content is protected