Connect with us

Politics

AP లో NDA కూటమి విజయంపై NATS హర్షం; చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలకు అభినందనలు

Published

on

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం (Telugu Desam Party), జనసేన, బిజెపి కూటమికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ (AP) ప్రజల విజయమని అభివర్ణించింది.

ఎన్డీఏ (National Democratic Alliance) కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేయాలనే ఆకాంక్షను నాట్స్ (North America Telugu Society) వ్యక్తం చేసింది.

అమెరికా (United States of America) లో ఉండే తెలుగు ప్రజల తరఫున నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected