Connect with us

Associations

తొలిసారి మహిళకు నాట్స్ ఛైర్మన్ పదవి, అరుణ గంటి సారధ్యంలో కొత్త డైరెక్టర్లు

Published

on

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్‌లో తొలిసారి ఓ మహిళను బోర్డ్ ఛైర్మన్ పదవి వరించింది. భాషే రమ్యం సేవే గమ్యం అని ఉదయించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ బోర్డు బాధ్యతలను అరుణ గంటి భుజానికెత్తుకున్నారు. పదవి అంటే అలంకారం కాదు బాధ్యత అని భావించి నాట్స్‌లో అంచెలంచెలుగా ఎదిగిన అరుణ గంటి కి నాట్స్ సభ్యులు బోర్డ్ ఛైర్ పర్సన్‌ పదవిని కట్టబెట్టారు.

2011 నుంచి అరుణ గంటి నాట్స్‌లో తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. తన నాయకత్వ ప్రతిభతో నాట్స్‌కు మహిళల మద్దతు కూడగట్టడంలో ఆమె విశేష కృషి జరిపారు. తన మీద నమ్మకం ఉంచి నాట్స్ బోర్డ్ బాధ్యతలను అప్పగించిన నాట్స్ సభ్యులకు అరుణ గంటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సాధికారిత, మహిళా చైతన్యం కోసం నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్‌గా తనవంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే చిన్నారులు, యువతలో సేవాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలు తన ప్రాధాన్యత అని అరుణ గంటి చెప్పుకొచ్చారు. నాట్స్ వైపు వారిని ఆకర్షించేలా తన ప్రయత్నాలు ఉంటాయన్నారు.

వైస్ ఛైర్మన్ గా ప్రశాంత్ పిన్నమనేని, బోర్డ్ కార్యదర్శిగా శ్యామ్ నాళం కు బాధ్యతలు అప్పగించారు. హరినాథ్ బుంగతావుల, భాను ప్రకాష్ ధూళిపాళ్ల లను ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్స్ గా బోర్డు ఖరారుచేసింది. 2022- 23 సంవత్సరానికి నాట్స్ ప్రకటించిన బోర్డు సభ్యుల వివరాలు ఇవిగో.

అరుణ గంటి, చైర్ వుమన్
శ్రీధర్ అప్పసాని, ఇమ్మీడియేట్ పాస్ట్ చైర్మన్
ప్రశాంత్ పిన్నమనేని, వైస్ చైర్మన్
శ్యామ్ నాళం, బోర్డ్ సెక్రటరీ
శేఖర్ అన్నే, ప్రెసిడెంట్
డా. మధు కొర్రపాటి
శ్రీనివాస్ గుత్తికొండ
మోహన కృష్ణ మన్నవ
డా. సుధీర్ అట్లూరి
ఆది గెల్లి
శ్రీ హరి మందాడి
శ్రీనివాస్ మంచికలపూడి
రాజ్ అల్లాడ
ప్రేమ్ కలిదిండి
కృష్ణ మల్లిన
వంశీ కృష్ణ వెనిగళ్ల
చంద్రశేఖర్ కొణిదెల
శ్రీనివాస్ మల్లాది
రాజేంద్ర మాదాల
మధు బోడపాటి
సునీల్ పాలేరు
శ్రీనివాస్ అరసాడ
రాజేష్ నెట్టెం
రఘు రొయ్యూరు
సుమిత్ అరిగపూడి
శ్రీనివాస్ బొప్పన
మూర్తి కొప్పాక

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected