Connect with us

Competitions

NATA Idol @ Atlanta, June 17: నేటి నాటా గాయకులే రేపటి సినీ గాయకులు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సమితి (North American Telugu Association – NATA) ‘నాటా’ మహాసభలు వచ్చే జూన్ 30 నుండి జులై 2 వరకు టెక్సస్ రాష్ట్రంలోని డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించనున్న సంగతి అందరికీ విదితమే.

డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి (Dr. Sridhar Reddy Korsapati) అధ్యక్షతన, ఎన్ఎంఎస్ రెడ్డి కన్వీనర్ గా జరగబోయే ఈ 2023 నాటా మహాసభలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అమెరికాలోని ముఖ్య నగరాల్లో నాటా డే పేరు మీద ఫండ్రైజింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా నాటా ఐడోల్ కార్యక్రమాన్ని అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో జూన్ నెలలో నిర్వహిస్తున్నారు. అట్లాంటా లో నాటా ఐడోల్ పోటీలు శనివారం, జూన్ 17న కమ్మింగ్ లోని వెస్ట్ ఫోర్సైత్ హై స్కూల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అమెరికాలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రాంతీయ గాయనీగాయకుల ప్రతిభను వెలికితీయడమే నాటా ఐడోల్ ముఖ్య ఉద్దేశం. సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ నాటా జులై 1న మహాసభలలో నిర్వహించబడును. సింగర్ ఎస్.పి శైలజ మరియు గీత రచయిత అనంత శ్రీరాం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.

ఇందులో గెలిచినవారికి తెలుగు సినిమాలో పాట పాడే అవకాశం లభించును. నేటి నాటా గాయకులు రేపటి సినీ గాయకులు కావాలంటే www.NRI2NRI.com/NATAIdol2023 లో నమోదు చేసుకోండి లేదా నాటా ఐడోల్ జట్టు సభ్యులను సంప్రదించండి. మరిన్ని వివరాలకు ఫ్లయర్ చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected