Connect with us

Convention

అట్టహాసంగా నాటా కన్వెన్షన్ ప్రారంభం, బాంక్వెట్ డిన్నర్ అదుర్స్

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సమితి (North American Telugu Association – NATA) ‘నాటా’ 2023 కన్వెన్షన్ నిన్న జూన్ 30న ఘనంగా ప్రారంభం అయ్యింది. టెక్సస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలోని డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ లో నాటా నాయకులు అట్టహాసంగా ప్రారంభించారు.

డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి (Dr. Sridhar Reddy Korsapati) మరియు నాటా కన్వీనర్ NMS రెడ్డి ఆధ్వర్యంలోని కన్వెన్షన్ నిర్వహణ కమిటీ, 3 రోజుల కన్వెన్షన్ లో భాగంగా నిన్న జూన్ 30 శుక్రవారం రోజున బాంక్వెట్ డిన్నర్ తో నాటా 2023 కన్వెన్షన్ కి గ్రాండ్ కిక్ ఆఫ్ ఇచ్చినట్లయింది.

ముందుగా రెజిస్ట్రేషన్ మరియు తేనీటి విందుతో ఆహ్వానితులందరూ సోషలైజ్ అవుతూ కనిపించారు. అనంతరం మెయిన్ స్టేజీ వద్ద ఆసీనులవగా జ్యోతి ప్రజ్వలనతో నాటా (North American Telugu Association) కన్వెన్షన్ ప్రారంభించారు.

భారతీయ మరియు అమెరికన్ జాతీయ గీతాలు (National Anthem) ఆలపించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) అందరినీ అలరించాయి. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ లీడర్షిప్ వేదిక పైనుండి అందరికీ స్వాగతం పలికారు.

అనంతరం 14 రంగాలలో 29 ప్రముఖులకు నాటా అవార్డులను అందజేశారు. కొంతమంది స్పాన్సర్స్ ని సత్కరించారు. అలాగే ఇండియా నుంచి వచ్చిన నటీనటులను వేదికమీదకు ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఇందులో రాంగోపాల్ వర్మ, ఆలీ, లయ, SP శైలజ, అనంత శ్రీరామ్, జబర్దస్త్ నటులు తదితరులు ఉన్నారు.

విఐపీలకు ప్రత్యేక సీటింగ్ మరియు భోజన ఏర్పాట్లు చేశారు. రెండు విఐపీలకు మరియు రెండు ఇతరులకు కలిపి నాలుగు చోట్ల భోజనాలు ఏర్పాటుచేయడంతో వెయిటింగ్ టైం పెద్దగా లేకపోవడం విశేషం. భోజనాలు కూడా రుచికరంగానే ఉన్నాయి.

నాటా వ్యవస్థాపకులు డా. ప్రేమ్ సాగర్ రెడ్డి (Dr. Prem Sagar Reddy), అధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, కన్వీనర్ NMS రెడ్డి, బాంక్వెట్ ఛైర్ తదితరులు కాసేపు ప్రసంగించారు. మనోజ్ ఇరువూరి (Manoj Iruvuri) మరియు తోటి మహిళా వ్యాఖ్యాత తమ వాక్చాతుర్యంతో అందరినీ కట్టిపడేసేలా కార్యక్రమాన్ని నడిపారు.

తానా, ఆటా, నాట్స్, టిటిఏ, టీడీఫ్ వంటి జాతీయ మరియు టాంటెక్స్, టిపాడ్ వంటి స్థానిక తెలుగు సంస్థల (Telugu Associations) ప్రతినిధులు ఈ నాటా కన్వెన్షన్ లో పాల్గొని తమ మద్దతు తెలిపారు. సాధారణ పౌరులు, తెలుగువారు కూడా పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాటా (NATA) అవార్డ్స్ అందుకున్న వారిలో టివీ5 శ్రీధర్ చిల్లర, శంకరనేత్రాలయ బాల రెడ్డి ఇందుర్తి, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, ఎన్ రెడ్డి ఊరిమిండి (NRU), సాక్షి టీవీ కొమ్మినేని శ్రీనివాసరావు, పలువురు డాక్టర్లు ఉన్నారు. బాంక్వెట్ కమిటీని వేదిక మీదకు పిలిచి అభినందించారు.

టాలీవుడ్ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ (Anup Rubens) తన ట్రూప్ తో నిర్వహించిన లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఆహ్వానితులను అలరించింది. చివరిగా వందన సమర్పణతో నాటా కన్వెన్షన్ (NATA Convention) మొదటి రోజును విజయవంతంగా ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected