రెండు నెలలుగా విద్యార్థులపరీక్షల రద్దు కోసం అలుపెరగని పోరాటంతో విజయం సాధించిన నారా లోకేష్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కోవిడ్ ముప్పు నుంచి లక్షలాది విద్యార్థులను తప్పించిన హీరోగా నారా లోకేష్ ఏపీ విద్యార్థుల మనసులు గెలుచుకోగా, కోవిడ్‌తో బలి చేసేందుకు కూడా వెనుకాడని జగన్ రెడ్డి విద్యార్థుల పాలిట విలన్‌గా మారారు. కోవిడ్ తీవ్రతపై నిపుణుల హెచ్చరికలు, అంతర్జాతీయ అధ్యయనాలు, వైద్యుల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోవిడ్ తీవ్రతలో పరీక్షలు వద్దంటూ తొలిసారిగా ప్రభుత్వానికి లేఖ రాయడం ద్వారా తన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు, విద్యావేత్తలు కూడా కరోనా సంక్షోభ సమయంలో పరీక్షలు నిర్వహించొద్దని వేలాది మంది వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించి పరీక్షలు రద్దు చేయాలని కోరారు. నారా లోకేష్ వినతులు పంపిన నాడే పరీక్షలు రద్దు చేసి వుంటే కోర్టులలో ఏపీ సర్కారు దోషులుగా నిలబడేది కాదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం సీబీఎస్ఈ తోపాటు అన్ని పరీక్షలు రద్దుచేసుకోగా, దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ బోర్డు పరీక్షలు రద్దు చేశాక కూడా పరీక్షలు రద్దు చేయకుండా మొండిగా మూర్ఖంగా పరీక్షల నిర్వహణకి వెళ్లడంతో జగన్ సర్కార్ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. కేవలం నారా లోకేష్ విద్యార్థుల తరఫున పోరాడుతున్నారని, పరీక్షలు రద్దు చేస్తే క్రెడిట్ లోకేష్‌కి వెళుతుందనే కక్షతో 80 లక్షల మందిని కోవిడ్‌కి బలిపెట్టడానికి సిద్ధమైన జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం పరీక్షలు రద్దు చేయాల్సిన ఆవశ్యకతని వివరిస్తూ నారా లోకేష్ సీఎంకి, గవర్నర్‌కి లేఖలు రాశారు. డిజిటల్ టౌన్ హాల్ మీటింగ్‌ల ద్వారా సేకరించిన లక్షలాది విద్యార్థుల అభిప్రాయాలను నివేదించారు. అయినా ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్లింది. చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో పరీక్షలు రద్దు చేసింది జగన్‌రెడ్డి ప్రభుత్వం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పరీక్షల నిర్వహణ సిబ్బంది ప్రాణాల రక్షణే ధ్యేయంగా నారా లోకేష్ సాగించిన పోరాటంలో చివరికి విజయం సాధించారు.