ఆంధ్రప్రదేశ్, గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం గుంటూరుకు వెళ్లారు. ఆడబిడ్డలకు ఆన్యాయం జరిగితే గన్ కంటే జగన్ ముందుంటార ని గతంలో వైసీపీ నేతలు అన్నారని, ఇప్పుడు ఆయనె క్కడని లోకేశ్ ప్రశ్నించా రు. ప్రత్తిపాడు పోలీసుస్టేషన్ నుంచి విడుదలయ్యాక రాత్రి మంగళగిరి లో ని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షల పరిహారం తమకు అవస రం లేదని, తమ కుమార్తెను తీసుకురావాలని రమ్య కు టుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారని తెలిపారు. గన్ లేని జగన్ ముఖ్యమంత్రి అయినదగ్గిరనుంచి 500 మంది మహిళపై దాడులు జరిగాయి, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలపై ప్రతి రెండు రోజులకో అఘాయిత్యం అన్నారు. ఇన్ని దాడులు మహిళలపై జరుగుతుంటే మీరు చెప్పిన దిశా చట్టం ప్రకారం ఒక్కరికైనా శిక్ష పడిందా అంటూ ప్రశ్నించారు.