Connect with us

Celebrations

శ్వాప్నికులు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు @ Ireland, Dublin

Published

on

నవయువమేధో శ్రామికులు, శ్వాప్నికులు, భావితరాల భవిష్యత్తుకు భరోసా శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)) గారి 73 వ జన్మదిన వేడుకలు ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ (Dublin) నగరంలో ఎన్నారై టీడీపీ ఐర్లాండ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

ఈ సంధర్బంగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకతని వ్యక్తం చేస్తూ ఆయన ముఖ్యమంత్రి (Chief Minister) గా రాష్ట్రము అధిరోహించిన ప్రగతి శిఖరాలను చూసి నేడు ప్రస్తుతం రాష్ట్రము లో నెలకొన్న పరిస్థితులను బేరీజు వేశారు.

అందరూ జగన్ (YS Jaganmohan Reddy) రౌడీయిజంపై విచారం వ్యక్తం చేసి సైకో పాలనకు స్వస్తి పలికి, సైకిల్ పాలనకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ ఐర్లాండ్ (NRI TDP Ireland) తెలుగు మహిళ అధ్యక్షురాలు సీత కేకే కట్ చేసి సభ్యులకు పంచారు.

ప్రెసిడెంట్ భాష్యం భరత్, రీజియనల్ కోఆర్డినేటర్ డా.కిషోర్ బాబు చలసాని మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రంగ గల్లా, యశ్వంత్ మడకశిర, కాట్రగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, నరేంద్ర, శివబాబు, రామకృష్ణ , విజయ్ తదితరులు పాల్గొని ఈ పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected