Connect with us

Celebrations

జయరాం కోమటి ఆధ్వర్యంలో బే ఏరియా లో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Published

on

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 73వ పుట్టిన రోజు వేడుకలు కాలిఫోర్నియా, బే ఏరియా లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టిడిపి యుఎస్‌ఎ అధ్యక్షులు జయరాం కోమటి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు పలువురు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని అంటూ, ఈ దిశగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్నారై టీడిపి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే టిడిపికి అధికారం వచ్చేలా మద్దతు ఇవ్వాలన్నారు.

బే ఏరియా లో టిడిపికి గట్టి మద్దతుదారునిగా పేరు ఉన్న వెంకట్‌ కోగంటి మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని అన్నారు. అన్నింటా వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించేందుకు ఎన్నారైలంతా ముందుకు రావాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఫిలడెల్ఫియాకు చెందిన రవి మందలపు తోపాటు విజయ్‌ గుమ్మడి, లక్ష్మణ్‌ పరుచూరి, గోకుల్‌ రాచవరపు, జోగినాయుడు, వీరు ఉప్పల, వెంకట్‌ అడుసుమల్లి, హరి సన్నిధి, వెంకట్‌ గొంప, కోటిబాబు కోటిన, భాస్కర్‌ అన్నె, మోహన్‌, కళ్యాణ్‌ కోట, స్వరూప్‌ వాసిరెడ్డి, రవి, సాయి కంభంపాటి, మధు కందేపి, సాయి యనమదల, సిద్ధు పావలూరి, సత్యనారాయణ, వినయ్‌ యలమర్తి, భరణి యాతం, రమేష్‌ నాయుడు, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected