Connect with us

Birthday Celebrations

ర్యాలీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 102వ పుట్టినరోజు సంబరాలు విజయవంతం @ North Carolina

Published

on

Raleigh, North Carolina: నార్త్ కరోలినా రాష్ట్రంలోని ర్యాలీ నగర ఎన్టీఆర్ ఫ్యాన్స్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ పుట్టినరోజు సంబరాలు విజయవంతంగా నిర్వహించారు. ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao – NTR) అభిమానులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

చివరి నిమిషంలో వేదిక మార్చినప్పటికీ, చక్కని ఎనర్జీ లెవెల్స్ తో అందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముందుగా అందరికీ స్వాగతం పలికి ఎన్టీఆర్ (NTR) విగ్రహానికి జ్యోతి వెలిగించి, పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. అన్న ఎన్టీఆర్ పాటలతో రాఘవ్ కొలగాని, విద్య సాగర్, రవి అందరినీ అలరించారు.

ఈ కార్యక్రమానికి ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహం బహు చక్కగా ఉన్నది. ఆహ్లాదకరమైన వాతావరణంలో కేక్ కట్ చేసి ఎన్టీఆర్ 102వ పుట్టినరోజు సందర్భంగా తమ ఆనందాన్ని తెలియపరిచారు. ఈ సందర్భంగా జై ఎన్టీఆర్… జై జై ఎన్టీఆర్ (Jai NTR) అంటూ నినాదాలతో హోరెత్తించారు.

తన చక్కని వ్యాఖ్యానంతో వంశి బొట్టు (Vamsi Bottu) ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చారు. డిన్నర్ సమన్వయం చేయడంలో సత్య కొల్లా, రుచికరమైన బోజనాలను అందించిన ఛార్మినార్ (Charminar Restaurant) రెస్టారెంట్ నుంచి రాకేష్ ని అందరూ అభినందించారు. అలాగే శశిధర్ చదలవాడ, రామ్ క్రియేషన్స్ నుంచి నాగ గొంది, రవి లాము, కిరణ్ చిలుకూరి, కేశవ్ వేముల తదితరులు ఈవెంట్ లాజిస్టిక్స్ కి సంబంధించి పలు విభాగాలలో తోడ్పడ్డారు.

ప్రవీణ్ తాతినేని, కుమార్ చల్లగొళ్ల, రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda), మూర్తి అక్కిన, శిరీష్ గొట్టిముక్కల, శ్రీధర్ గొట్టిపాటి (Sridhar Gottipati), శ్రీని మార్తల, మాధవి మార్తల, శ్రీని అనంత, రమేష్ తుమ్మలపల్లి, ప్రశాంత్ కాట్రగడ్డ (Sai Prasanth Katragadda), శ్రీని వాస తదితర జాతీయ, స్థానిక సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం.

ఈ కార్యక్రమ నిర్వహణలో ర్యాలీ కోర్ టీం సభ్యులు రామ్ అల్లు (Ram Allu), మిథున్ సుంకర (Mithun Sunkara), వినోద్ కాట్రగుంట (Vinodh Katragunta), హరీష్ కన్నెగంటి, రవి లాము, వంశి బొట్టు, శశిధర్ చదలవాడ, కేశవ్ వేముల, నాగ గొంది, వెంకట్ కోగంటి, సాయి శ్రీకాంత్ ఉప్పలపాటి, కిరణ్ చిలుకూరి, సాయి కాట్రగడ్డ, రాజు నడింపల్లి, సునీల్ కొల్లూరు కీలక పాత్ర పోషించారు.

వేదిక ప్రాంగణాన్ని అలంకరించిన విధానం (Venue Decoration) అందరినీ ఆకట్టుకుంది. భోజనానంతరం వందన సమర్పణ (Vote of Thanks) తో ఎన్టీఆర్ 102వ పుట్టినరోజు సంబరాలను ఘనంగా ముగించారు. అందరూ ఎన్టీఆర్ విగ్రహం దగ్గిర ఉత్సాహంగా ఫోటోలు తీసుకున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected