తానా ఎన్నికల్లో సహాయ కార్యదర్శి పదవికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ వాసి మురళి తాళ్లూరి బరిలోకి దిగారు. మురళి 2004లో ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వచ్చారు. 2013 నుంచి తానాలో క్రియాశీలకంగా సేవచేస్తున్నారు.
ప్రస్తుతం తానా సౌత్ వెస్ట్ రీజినల్ కోఆర్డినేటర్ గా సేవలందిస్తున్న మురళి, ఇంతకుముందు ఎన్నారై ఇన్సూరెన్స్ సర్వీసెస్, మనఊరికోసం 5కే వాక్, టీం స్క్వేర్, పాఠశాల తదితర కార్యక్రమాల కమిటీస్ లో సేవలందించారు. అలాగే ఎన్నో కల్చరల్ అండ్ మ్యూజికల్ ప్రోగ్రామ్స్ తానా తరపున సౌత్ వెస్ట్ రీజియన్ నిర్వహించారు.
ప్రస్తుతం ఉన్న సేవలను విస్తరించడంతో పాటు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడం, తానా సభ్యుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంచడం, ఇమ్మిగ్రేషన్ న్యాయపరమైన మార్గనిర్దేశం, ప్రవాసులకు బీమా ఆవశ్యకత, టీం స్క్వేర్ బలోపేతం వంటి కార్యక్రమాల ద్వారా ప్రవాసులకు తానాను దగ్గర చేయడం వంటి లక్ష్యాలు తనముందు ఉన్నాయని అంటున్నారు మురళి తాళ్లూరి.